• Telugu News
  • movies

Father And Son Movies: వెండి తెరపై తండ్రి కొడుకులు కలిసి నటించిన చిత్రాలివే… !

Father And Son Movies: చిత్ర పరిశ్రమలోకి చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు. అందులో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో వారసత్వ నటవారసులు పరిచయం అవుతూనే ఉంటారు. అభిమానులకు ఇష్టమైన హీరోలను తెరపై ఒక్కరిని చూస్తేనే ఎంతో సంబరపడుతుంటారు. అలాంటిది వెండితెరపై తండ్రికొడుకులను చుస్తే ప్రేక్షకులను పండగే అనే చెప్పాలి. ఆలా ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు అలరించిన సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ […].

By: jyothi

Updated On - Thu - 14 October 21

Father And Son Movies: వెండి తెరపై తండ్రి కొడుకులు కలిసి నటించిన చిత్రాలివే… !

Father And Son Movies: చిత్ర పరిశ్రమలోకి చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు. అందులో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో వారసత్వ నటవారసులు పరిచయం అవుతూనే ఉంటారు. అభిమానులకు ఇష్టమైన హీరోలను తెరపై ఒక్కరిని చూస్తేనే ఎంతో సంబరపడుతుంటారు. అలాంటిది వెండితెరపై తండ్రికొడుకులను చుస్తే ప్రేక్షకులను పండగే అనే చెప్పాలి. ఆలా ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు అలరించిన సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కొట్లాది మంది ప్రేక్షకులను అలరించాడు. ఇక ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. ఇక తండ్రి కొడుకులు కలిసి తాతమ్మ కల’ ‘రామ్ రహీమ్’ ‘అన్నదమ్ముల అనుబంధం’ ‘దాన వీర సూర కర్ణ’ వంటి సినిమాలో నటించారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ఇండస్ట్రీకి ఓ పిల్లర్ అని అంటారు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన నటవారసుడిగా కింగ్ నాగార్జున ఇండస్ట్రీకి వచ్చారు. ఇక వెండితెరపై నాగేశ్వరరావు, నాగార్జునతో కలిసి ఇద్దరూ ఇద్దరే’ ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ‘అగ్ని పుత్రుడు’ ‘శ్రీరామదాసు’ ‘మనం’ వంటి సినిమాలో నటించారు.

ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. ఇక తండ్రీకొడుకులు కలిసి బజార్ రౌడీ, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు,వంశీ,టక్కరి దొంగ వంటి చిత్రాలలో నటించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన విలన్ రోల్స్ నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ పరిచయమైయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి ‘బిల్లా’ ‘రెబల్, రాధే శ్యామ్’ చిత్రంలో నటించారు.

విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన నటవారసులుగా విష్ణు, మనోజ్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. కానీ ఇండస్ట్రీలో ఆయన నటవారసులు అనుకున్న విధంగా రాణించలేకపోయారు. మోహన్ బాబు, విష్ణుతో కలిసి గేమ్’, ‘సలీమ్’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’,’రౌడీ సినిమాలో నటించారు. ఇక మోహన్ బాబు నటించిన మేజర్ చంద్ర కాంత్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వగా ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా ఎన్టీఆర్ నటించారు.

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కొడుకు వెంకటేష్ సినిమాలోకి వచ్చారు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇక వెంకటేష్ నటవారసుడిగా రానా ఇండస్ట్రీకి వచ్చారు. రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో వెంకటేష్ కలిసి నటించారు.

అక్కినేని నాగార్జున నటవారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీకి వచ్చారు. అయితే నాగార్జున – నాగ చైతన్య కలిసి మనం, ప్రేమమ్ సినిమాలో నటించారు. నాగార్జున అఖిల్ కలిసి సిసింద్రీ సినిమాలో నటించారు. ఈ సినిమాతోనే అఖిల్సినీ పరిశ్రమకు పరిచయమైయ్యాడు. ఆ తర్వాత నాగార్జునతో కలిసి ‘మనం’ ‘అఖిల్’ చిత్రాల్లో కలిసి నటించాడు. ఇక చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమాన్ని సొంతం చేసుకున్నాడు. నేటితరం ఎంతో మంది యువ హీరోలకు ఆయన ఆదర్శం. ఆయన నటవారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. ఇక ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తండ్రి కొడుకులు కలిసి బ్రూస్ లీ’ ‘ఖైదీ నెంబర్ 150’ ఆచార్య వంటి సినిమాలో నటించారు.

Related News