• Telugu News
  • movies

Dubbing Movies: టాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ సాధించిన టాప్ 6 డబ్బింగ్ మూవీలు ఇవే..!

Dubbing Movies: కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచులలో చాలానే మార్పులు వచ్చాయి.. క్రమంగా ఓటిటి ప్రభావం పెరిగి థియేటర్ వ్యవస్థ పడిపోయింది...

By: jyothi

Published Date - Thu - 6 October 22

Dubbing Movies: టాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ సాధించిన టాప్ 6 డబ్బింగ్ మూవీలు ఇవే..!

Dubbing Movies: కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచులలో చాలానే మార్పులు వచ్చాయి.. క్రమంగా ఓటిటి ప్రభావం పెరిగి థియేటర్ వ్యవస్థ పడిపోయింది.. దీని వల్లనే సినిమాలు థియేటర్ వరకు వెళ్లి చూసే ఆడియెన్స్ శాతం తగ్గిపోయింది.. అయితే ప్రేక్షకులు ఇప్పటికి కూడా మంచి కంటెంట్ తో సినిమాలు చేస్తే థియేటర్ కు వస్తున్నారు.. మరి ఈ క్రమంలోనే మన తెలుగులో డబ్బింగ్ సినిమాలుగా వచ్చి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్బింగ్ సినిమాలు..

కేజిఎఫ్ 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించాడు.. కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.. పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యి 1000 కోట్లను క్రాస్ చేసి ఆశ్చర్య పరిచింది.. ఈ కన్నడ సినిమా తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించి టాప్ స్థానంలో ఉంది.

విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించిన విక్రమ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ తమిళ్ సినిమాలో తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ సాధించింది.

గంగూబాయి : అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన గంగూబాయి సినిమా మంచి విజయం సాధించింది. హిందీ సినిమా అయినా కూడా తెలుగులో మంచి వసూళ్లు రాబట్టింది.

బీస్ట్ : విజయ్ దళపతి, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన బీస్ట్ సినిమా కూడా నెగిటివ్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్స్ సాధించింది..

బ్రహ్మాస్త్ర : రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. నాగార్జున కూడా కీలక పాత్రలో నటించడంతో తెలుగులో కూడా బాగానే కలెక్షన్స్ సాధించింది.

డాన్ : తమిళ్ సినిమా అయినా ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించాడు.. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసారు.. ఈ సినిమా ఇక్కడ కూడా బాగానే వసూళ్లు రాబట్టింది.

వాలిమై : తమిళ్ చిత్రం అయినా వాలిమై సినిమాలో అజిత్ హీరోగా నటించాడు. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించాయి..

Read Also : Smart phones : ధమాకా అఫర్.. రూ.7వేల లోపే వస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్..

Read Also : Vastu Shastra : ఇంట్లో ఈ దిక్కులో లక్ష్మీ దేవి ఫొటో పెడితే 10 రెట్లు ఐశ్వర్యం కలుగుతుంది..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News