Star Heros : సినిమా రంగంలో ఎక్కువగా వినిపించే పేరు రీమేక్. ఒక భాషలో మంచి హిట్ అయిన సినిమాను ఇతర భాషల్లో రీమేక్ లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఒక రకంగా సేఫ్ జోన్. కచ్చితంగా హిట్ వస్తుందనే నమ్మకంతో రీమేక్ లు ఎక్కువగా చేస్తుంటారు కొందరు హీరోలు. టాలీవుడ్ లో పవన్, చిరు దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాని వరకు చాలామంది హీరోలు రీమేక్ లు చేశారు.
కానీ ఇద్దరు హీరోలు మాత్రమే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రీమేక్ కూడా చేయకుండా స్టార్ హీరోలుగా ఎదిగారు. అందులో ఒకరు సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఇంకొకరు అల్లు అర్జున్. వీరిద్దరూ ఇప్పుడు అగ్ర హీరోలుగా ఉన్నారు. అయితే ఏ ఒక్క సినిమాను కూడా వీరు రీమేక్ చేయలేదు.
కేవలం టాలీవుడ్ రచయిథలు రాసిన కథలతో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండే రచయితపై నమ్మకాన్ని పెంచడమే అవుతుంది. దాని వల్ల టాలీవుడ్ కు ప్రత్యేక గుర్తింపు కూడా వస్తుంది. తెలుగు కథలతో వీరు హిట్లు కొడితే అవి ఇతర భాషల్లో కూడా రీమేక్ అవుతున్నాయి.
ఇలా వీరిద్దరూ కలిసి తెలుగు కథలకు ప్రత్యేక గుర్తింపును తీసుకు వస్తున్నారు. వీరిద్దరూ భవిష్యత్ లో కూడా రీమేక్ లు చేసే ఆస్కారం లేదని అంటున్నారు. హిట్ అయినా ప్లాప్ అయినా సరే తెలుగు కథలను మాత్రమే నమ్ముతామని బల్లగుద్ది చెబుతున్నారు వారి అభిమానులు.
Read Also :Tamannaah Bhatia : ఏంటి.. తమన్నాకు ఆ చెత్త అలవాటు ఉందా.. మానలేక పోతుందా..?
Read Also : Sri Reddy : పవన్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!