Sr NTR-ANR: ఆరేళ్లు మాట్లాడుకోని ఎన్టీఆర్, ఏఎన్నార్.. అంత గొడవ జరిగిందా..?

Sr NTR-ANR: సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు మధ్య బంధం కేవలం కోస్టార్స్ వంటిది మాత్రమే కాదు. సోదరుల కంటే ఎక్కువ..

By: jyothi

Published Date - Mon - 26 September 22

Sr NTR-ANR: ఆరేళ్లు మాట్లాడుకోని ఎన్టీఆర్, ఏఎన్నార్.. అంత గొడవ జరిగిందా..?

Sr NTR-ANR: సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు మధ్య బంధం కేవలం కోస్టార్స్ వంటిది మాత్రమే కాదు. సోదరుల కంటే ఎక్కువ. వీరిద్దరు అన్నదమ్ముల కంటే చాలా అప్యాయంగా ఉండేవారు. ఒక తల్లికి పుట్టకపోయినా ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకుంటూ తమ చివరి శ్వాస వరకు మెలుగుతూ వచ్చారు. అయితే, అనుకోకుండా ఒకసారి వీరి మధ్య అభిప్రాయం భేదం తలెత్తింది. దీని కారణంగా వీరు ఆరేళ్లు మాట్లాడుకోలేదట..

ఎన్టీఆర్, ఏఎన్నార్ తప్పు ఎవరది..

ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పట్లో పోటీపడి సినిమాలు చేసేవారు. వీరిద్దరు కలిసి చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అందులో చాలా వరకు విజయాలు సాధించాయి. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు తాము తర్వాత ఏం సినిమా చేయబోతున్నాం.. స్టోరీ, హీరోయిన్, ప్రొడక్షన్, ఇలా ప్రతిదీ డిస్కస్ చేసుకునేవారట.. ఏఎన్నార్ కేవలం నటనకు మాత్రమే పరిమితం అయ్యారు.

కానీ ఎన్టీఆర్ నటనతో పాటు దర్వకత్వం, నిర్మాతగాను రాణించారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి చాలా సినిమాలు నిర్మించారు. ఇక అక్కినేని గారు హైదరాబాద్‌లో ఏకంగా తన భార్య అన్నపూర్ణమ్మ పేరిట స్టూడియో నిర్మించారు. ఇాలా వీరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని పనులు మొదలు పెట్టేవారట.. అయితే, ఒకానొక టైంలో వీరిమధ్య చిన్న అభిప్రాయ భేదం వచ్చింది.

ఏఎన్నార్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి విదేయుడిగా ఉండేవారట..పార్టీ పెద్దలు చెప్పారని మద్రాసు నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ మాత్రం తన కుటుంబాన్ని, ఇండస్ట్రీని వదిలి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఇష్టపడలేదట.. దాంతో ఏఎన్నార్ హైదరాబాద్ వచ్చేస్తే.. ఎన్టీఆర్ అక్కడే ఉండిపోయారట.. ఇలా వీరు ఆరేళ్ల వరకు మాట్లాడుకోలేదని గుమ్మడి తన పుస్తకంలో రాసుకొచ్చారు. చివరకు ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాక వీరు మళ్లీ కలిసిపోయారట..

Read Also : Bhuvaneswari: వ్య‌భిచారంతో సౌత్ ఇండియాను ఊపేసిన భువ‌నేశ్వ‌రి.. స్టార్ హీరోలు, బ‌డా నేత‌లు కూడా..!

Read Also :Balakrishna: విశ్వాసం లేని కుక్కలు.. జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన బాలయ్య..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News