Karthika Deepam: డాక్ట‌ర్ బాబుతో వంట‌ల‌క్క స‌ర‌సాలు.. మనిషేనా అని తిట్టిన కార్తీక్

Karthika Deepam బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న పాపుల‌ర్ సీరియ‌ల్స్‌లో కార్తీక‌దీపం ఒక‌టి. తాజాగా 1208వ ఎపిసోడ్ జ‌ర‌గ‌గా, ఇందులో సౌందర్య, ఆనందరావులు వాయింగ్‌కి బయలుదేరుతూ.. ఇంట్లో ప‌రిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘చాలా సంతోషంగా ప్రశాంతంగా అనిపిస్తోంది’ అనుకుంటారు . ఇంత‌లో పిల్లలు వచ్చి.. ‘నాన్నమ్మా మేము కూడా మీతో వాకింగ్‌కి వస్తాం’ అనడంతో.. సరే వెళ్లి అమ్మకు చెప్పి రండీ అనడంతో పైకి పరుగుతీస్తారు. కార్తీక్ త‌ల‌స్నానం చేసి వ‌చ్చి అద్దంలో చూసుకుంటూ ఉండగా వెనుక […].

By: jyothi

Published Date - Sat - 27 November 21

Karthika Deepam: డాక్ట‌ర్ బాబుతో వంట‌ల‌క్క స‌ర‌సాలు.. మనిషేనా అని తిట్టిన కార్తీక్

Karthika Deepam బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న పాపుల‌ర్ సీరియ‌ల్స్‌లో కార్తీక‌దీపం ఒక‌టి. తాజాగా 1208వ ఎపిసోడ్ జ‌ర‌గ‌గా, ఇందులో సౌందర్య, ఆనందరావులు వాయింగ్‌కి బయలుదేరుతూ.. ఇంట్లో ప‌రిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘చాలా సంతోషంగా ప్రశాంతంగా అనిపిస్తోంది’ అనుకుంటారు . ఇంత‌లో పిల్లలు వచ్చి.. ‘నాన్నమ్మా మేము కూడా మీతో వాకింగ్‌కి వస్తాం’ అనడంతో.. సరే వెళ్లి అమ్మకు చెప్పి రండీ అనడంతో పైకి పరుగుతీస్తారు.

కార్తీక్ త‌ల‌స్నానం చేసి వ‌చ్చి అద్దంలో చూసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చిన దీప.. ఆ టవల్ తీసుకుని కార్తీక్ తలపైన వేసి తుడవడం మొదలుపెడుతుంది. తల తుడుస్తున్నావా.. పప్పు రుబ్బినట్లు రుద్దుతావేంటీ? ఇలా అయితే దువ్వుకోవడానికి జుట్టు ఉండదు దీపా అంటాడు. దీనికి ‘మరి నేను వంటలక్కని కదా ఇలానే తుడుస్తాను’ అంటుంది. కార్తీక్ తల అటు ఇటు తిప్పుతూ.. ‘ఆపు ఆపు అంటూ అరుస్తూనే ఉంటాడు.

‘అమ్మా మేము నాన్నమ్మా వాళ్లతో వాకింగ్‌కి వెళ్తున్నాం సరేనా’ అనడంతో సరే అంటుంది. పరుగుతియ్యబోతుంటే.. ‘పిల్లలు టిఫిన్ ఏం చెయ్యమంటారు’ అని దీప అరుస్తుంది. ‘ఉప్మా చెయ్యమ్మా’ అని పరుగుతీస్తారు. ఆ సమాధానానికి దీప, కార్తీక్ ముఖం ముఖం చూసుకుంటారు. ఇక సీన్ కట్ చేస్తే.. కార్తీక్ ఇంటి గేట్ ముందు మోనిత ప్రియమణితో కలిసి కారులో కాపలా కాస్తుంది. ‘ఏంటమ్మా ఇది మన కారు ఉండగా క్యాబ్ బుక్ చేశారు.. పైగా కాపలా కాస్తున్నారు? ఎందుకమ్మా’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.

‘నోరుమూసుకుని ఉండు ప్రియమణి.. ప్లీజ్.. మన కారు అయితే గుర్తు పడతారు కదా.. ఈ క్యాబ్ డ్రైవర్‌కి కూడా తెలుగు సరిగా రాదు.. సో నో ప్రాబ్లమ్.. మనం ఈజీగా కార్తీక్‌ని ఫాలో కావాలి.. గొడవ చెయ్యాలి.. ఇలా నా ప్లాన్స్ నాకున్నాయి.. నువ్వు కూల్‌గా ఉండు చాలు..’ అంటుంది.

బస్తీలో హెల్త్ క్యాంప్‌కి వారణాసి, మిగిలిన బస్తీవాళ్లు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. డాక్టర్ బాబు, వంటలక్క రాబోతున్నారని సంబరంగా ఉంటారు. ఇక్కడ కార్తీక్ దీప బయలుదేరతారు. గేట్ దగ్గర మోనిత ఉందేమో అని కూడా అటు ఇటు చూసి.. అక్కడెక్కడా మోనిత కనిపించకపోవడంతో.. మురళీ కృష్ణ పొరబడి ఉంటాడని బస్తీకి బయలుదేరతారు. అయితే కాస్త దూరంలో ఉన్న మోనిత.. దీప వాళ్లు వెళ్లడం చూసి క్యాబ్ డ్రైవర్‌కి ఫాలో అవ్వమని చెబుతుంది.

కార్తీక్ బస్తీకి వెళ్లి.. అందరినీ పలకరించి, వైద్యం చెయ్యడం మొదలుపెడతాడు. అయితే ఒక పేషెంట్ తన హెల్త్ సమస్యలతో పాటు.. తన పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుని బాధపడుతుంది. దాంతో ఆమెని ఓదార్చే పనిలో కార్తీక్.. ‘ఏంటి ఆడపిల్ల పుట్టకపోతే మీరేం చేస్తారు? అందుకుని పిల్లల్ని మిమ్మల్ని వదిలేసి వెళ్లాడా.. మనిషేనా అతడు’అంటూ తిడతారు. ‘మరి నన్ను అలానే వదిలేసిన నిన్ను ఏం అనాలి కార్తీక్ అంటూ మోనిత, పక్కనే బాబుతో ప్రియమణి నిలబడటంతో కథనం ఉత్కంఠగా మారింది.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News