Lakshmi Rai : ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పేరుతో మార్మోగిపోతోంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే చాలామంది కెరీర్ ను కోల్పోయారు. ఇక మీటూ ఉద్యమం తర్వాత చాలామంది దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. దాంతో మరోసారి టాలీవుడ్ లో కలకలం రేగింది.
లక్ష్మీరాయ్ గతంలో తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. నార్త్ నుంచి వచ్చిన ఈ భామకు తెలుగులో బాగానే ఆఫర్లు వచ్చాయి. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఇక చిరంజీవితో కలిసి ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. మీకు సౌత్ ఇండస్ట్రీ లో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడగ్గా.. క్షణం ఆలోచించకుండా ఆన్సర్ ఇచ్చింది ఈ భామ. అవును నేను తెలుగులో నటించేటప్పుడు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్నాను. కొందరు హీరోలు నన్ను నేరుగానే కోరిక తీర్చమని అడిగారు.
కానీ వారి పేర్లు నేను బయటకు చెప్పదలచుకోవట్లేదు. తెలుగులో చాలామంది మంచి వారే ఉన్నారు. కానీ కొందరు వల్గర్ గా చూసేవారు కూడా ఉన్నారు. వారి నుంచి నేను దూరంగా ఉన్నాను. కానీ తెలుగులోనే నాకు మంచి అవకాశాలు వచ్చాయి. ఎంతైనా బాలీవుడ్ తో పోలిస్తే తెలుగులో కాస్టింగ్ కౌచ్ చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చింది. ఈ భామ.
Read Also : Vidya Balan : ఆ డైరెక్టర్ రూమ్ కు తీసుకెళ్లి నీచంగా ప్రవర్తించాడు.. విద్యాబాలన్ సెన్సేషనల్..!
Read Also : Surekha Vani : అది పెద్దగా ఉన్న వాడు బాయ్ ఫ్రెండ్ గా కావాలి.. సురేఖ వాణి ఏంటీ కామెంట్లు..!