Tollywood Villains: ఈ టాలీవుడ్ విల‌న్ల రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక్‌..

Tollywood Villains: తెలుగు సినిమా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు హీరోలకు ఎక్కువ క్రేజ్ విలన్లకు తక్కువ క్రేజ్ ఉండేది కానీ రోజులు మారాయి. ప్రస్తుతం హీరోలతో పాటు విలన్లకు కూడా సమాన స్థాయిలో క్రేజ్ ఉంటుంది. హీరోల వలనే కాకుండా విలనిజం వలన కూడా పలు సినిమాలు ఆడుతున్నాయి. కాబట్టి విలన్ ఎంపికలో కూడా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు వహిస్తున్నారు. అలా తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఎక్కువగా కొంత మంది మాత్రమే విలన్ రోల్స్ చేస్తూ […].

By: jyothi

Published Date - Sun - 5 December 21

Tollywood Villains: ఈ టాలీవుడ్ విల‌న్ల రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక్‌..

Tollywood Villains: తెలుగు సినిమా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు హీరోలకు ఎక్కువ క్రేజ్ విలన్లకు తక్కువ క్రేజ్ ఉండేది కానీ రోజులు మారాయి. ప్రస్తుతం హీరోలతో పాటు విలన్లకు కూడా సమాన స్థాయిలో క్రేజ్ ఉంటుంది. హీరోల వలనే కాకుండా విలనిజం వలన కూడా పలు సినిమాలు ఆడుతున్నాయి. కాబట్టి విలన్ ఎంపికలో కూడా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు వహిస్తున్నారు. అలా తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఎక్కువగా కొంత మంది మాత్రమే విలన్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నారు. వారి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే వారు తీసుకునే లెక్క కోట్లలోనే ఉంటుంది. వారి రెమ్యానరేషన్ వివరాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ కావాల్సిందే…

Tollywood Villains

తెలుగు నాట ప్రతి నాయకులుగా జగపతి బాబు, సోనూ సూద్ ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లను మాత్రమే మనం ఊహించుకుంటాం. కానీ ఇప్పుడు సినిమాల్లో కొత్త కొత్త విలన్లు వస్తున్నారు. పలువురు హీరోలు కూడా విలన్లుగా మారి పలువురు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారు కూడా కోట్లలో పారితోషకం తీసుకుంటున్నారు.

ఒకప్పుడు హీరోగా అలరించి ప్రస్తుతం విలన్ గా బిజీ అయిన నటుడు జగపతి బాబు. ఆయన విలన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో మెరుస్తున్నాడు. జగపతి బాబు విలన్ గా నటించాడంటే ఆ సినిమాలో ఏదో ఉంటుందని చాలా మంది అభిమానులకు అంచనాలు ఉన్నాయి. ఇక హీరో నుంచి విలన్ గా మారిన మరో స్టార్ శ్రీకాంత్. ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరున్న శ్రీకాంత్ ప్రస్తుతం బాలయ్య బాబు హీరోగా నటించిన అఖండ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఆయన కోటి పైనే అందుకున్నట్లు సమాచారం.

ఇక మరో పక్క జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ ఉండనే ఉన్నాడు. ఈయనకు హీరోలతో సమానంగా స్టార్ డమ్ ఉంటుంది. కావున ఈయన సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా మీద అందరికీ అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈయన తాను నటించే సినిమాలకు రోజుకు 10 లక్షల రూపాయల వరకూ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ హీరో సోనూ సూద్ కూడా తెలుగు నాట బాగానే పాపులర్ అయ్యాడు. ఈయన ఒక్క సినిమాకు దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ట్రెండీ విలన్లలో సంపత్ రాజ్ ఒకరు. మిర్చి సినిమాతో సంపత్ రాజ్ స్టార్ విలన్ గా మారిపోయాడు. అటువంటి సంపత్ రాజ్ సినిమాకు 40 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు.

Tags

Latest News

Related News