పెళ్ళి – పెటాకులు.. ఈ సినీ సెలబ్రిటీల అసలు కథ తెలుసా?

అక్కినేని నాగార్జున సతీమణి ఎవరు.? చాలామందికి ఠక్కున గుర్తుకొచ్చే సమాధానం అమల అనే. కానీ, నాగార్జున తనయుడు అక్కనేని నాగ చైతన్యకి తల్లి అమల కాదు. వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని నాగార్జున తొలుత పెళ్ళి చేసుకున్నారు. నాగార్జున – లక్ష్మిల సంతానం నాగచైతన్య. అఖిల్ సంగతి తెలిసిందే.. నాగార్జున – అమల సంతానం. సినీ పరిశ్రమలో ఇలాంటివి చాలానే వున్నాయి. సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుత భార్య […].

By: jyothi

Updated On - Fri - 20 August 21

పెళ్ళి – పెటాకులు.. ఈ సినీ సెలబ్రిటీల అసలు కథ తెలుసా?

అక్కినేని నాగార్జున సతీమణి ఎవరు.? చాలామందికి ఠక్కున గుర్తుకొచ్చే సమాధానం అమల అనే. కానీ, నాగార్జున తనయుడు అక్కనేని నాగ చైతన్యకి తల్లి అమల కాదు. వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని నాగార్జున తొలుత పెళ్ళి చేసుకున్నారు. నాగార్జున – లక్ష్మిల సంతానం నాగచైతన్య. అఖిల్ సంగతి తెలిసిందే.. నాగార్జున – అమల సంతానం. సినీ పరిశ్రమలో ఇలాంటివి చాలానే వున్నాయి.

సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్


బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుత భార్య కరీనా కపూర్. కానీ, సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృత సింగ్. అమృతతో విడాకుల తర్వాత సైఫ్ అలీ ఖాన్, ఓ విదేశీ భామతో డేటింగ్ కూడా చేశాడు. ఆ తర్వాత కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ భార్య అయ్యింది. సైఫ్ – కరీనాలకు ఇద్దరు సంతానం. సైఫ్ – అమృతలకు కూడా ఇద్దరు సంతానం.

మలైకా అరోరా – అర్భాజ్ ఖాన్

బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా అంటే, ఐటమ్ బాంబ్ అనే అందరికీ తెలుసు. ఈ బ్యూటీ బాలీవుడ్ నిర్మాత, నటుడు అర్బాజ్ ఖాన్ సతీమణి. చాలా ఏళ్ళ వైవాహిక జీవితం అనంతరం అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోయింది మలైకా అరోరా. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ – మలైకా డేటింగ్ వ్యవహారాలతో బిజీగా వున్నారు.

కమల్ హాసన్ – వాణి గణపతి

కమల్ హాసన్ – వాణి గణపతితో పెళ్ళి జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. విడాకుల అనంతరం సారికను పెళ్ళాడాడు కమల్ హాసన్. అయితే, సారికతోనూ కమల్ విడిపోయాడు. కమల్ కొన్నాళ్ళపాటు గౌతమితో డేటింగ్ చేశాడు. ఇద్దరూ చాలాకాలం సహజీవనం చేశాక, కొన్నాళ్ళ క్రితమే విడిపోవడంతో కమల్ మళ్ళీ ఒంటరయ్యాడు.

సుమంత్ – కీర్తి రెడ్డి

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలి ప్రేమ’ గుర్తుంది కదా.. ఆ సినిమాలో హీరోయిన్ అయిన కీర్తి రెడ్డిని సుమంత్ పెళ్ళాడాడు. అయితే, కొన్ని అనివార్య కారణాలతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది.

నోయెల్ – ఎస్తేర్

ర్యాపర్ నోయెల్ అంటే తెలియని తెలుగు సినీ సంగీత ప్రియులెవరుంటారు.? బిగ్ బాస్ రియాల్టీ షోతోనూ నోయల్ పాపులర్ అయ్యాడు. నోయెల్, హీరోయిన్ ఎస్తేర్ మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ గురించి ఇద్దరూ గొప్పగా ప్రకటించుకున్నారు. ఏమయ్యిందోగానీ, ఎక్కువ కాలం వీరి వైవాహిక జీవితం కొనసాగలేకపోయింది. ఇద్దరూ చట్టబద్ధంగా వేరుపడ్డారు.

హృతిక్ – సుజానే ఖాన్

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, తన భార్య సుజానే ఖాన్ నుంచి కొంత కాలం క్రితమే విడిపోయాడు. నిజానికి, ఇద్దరిదీ అన్యోన్య దాంపత్యం. వీరి దాంపత్య జీవితంలో ఓ ప్రముఖ హీరోయిన్ నిప్పులు పోసిందనే గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. చట్టబద్ధంగా విడిపోయినా హృతిక్ – సుజానేఖాన్ ఇప్పటికీ మంచి స్నేహితుల్లా కొనసాగుతున్నారు.

హీరోయిన్ మమతా మోహన్ దాస్ తన భర్త నుంచి విడిపోయింది. పూజా రామచంద్రన్ కూడా తన మొదటి భర్తతో విడిపోయింది. కొన్నాళ్ళ క్రితమే ఓ సినీ నటుడ్ని పెళ్ళాడింది. హీరో మంచు మనోజ్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సెలబ్రిటీల పెళ్ళిళ్ళు అనూహ్యమైన పరిణామాల నడుమ పెటాకులయ్యాయి. పిల్లలున్నా, తమ తమ జీవితాల్ని వేర్వేరుగా నడపడానికి కొందరు సెలబ్రిటీలు సిద్ధమయ్యారు. కొంతమందైతే, పెళ్ళయిన కొద్ది రోజులకే తమ వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసేసుకున్నారు. ఎవరి కారణాలు వారికి వుంటాయ్.. ఎవర్నీ తప్పు పట్టలేం.

 

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News