బాడీ షేమింగ్: భారీ అందాలే భారంగా మారాయ్..

బాడీ షేమింట్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండింగ్ వ్యవహారం. అందాల భామల అందాల్ని ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే, ఇంకో వైపు వాళ్ళని విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే, నెగెటివ్ ట్రోలింగ్ పట్ల ఆవేదన చెందే అందాల భామలే కాదు, అలాంటి ట్రోలింగ్ తకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుందని నమ్మే హీరోయిన్లు కూడా వున్నారు. అత్యధికంగా ఓ సెక్షన్ నెటిజన్లు వెతికేది ఈ భారీ అందాల భామల్నే.. అలా వెతికేవాళ్ళే ఎక్కువగా వీళ్ళని ట్రోలింగ్ […].

By: jyothi

Published Date - Sun - 23 May 21

బాడీ షేమింగ్: భారీ అందాలే భారంగా మారాయ్..

బాడీ షేమింట్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండింగ్ వ్యవహారం. అందాల భామల అందాల్ని ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే, ఇంకో వైపు వాళ్ళని విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే, నెగెటివ్ ట్రోలింగ్ పట్ల ఆవేదన చెందే అందాల భామలే కాదు, అలాంటి ట్రోలింగ్ తకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుందని నమ్మే హీరోయిన్లు కూడా వున్నారు. అత్యధికంగా ఓ సెక్షన్ నెటిజన్లు వెతికేది ఈ భారీ అందాల భామల్నే.. అలా వెతికేవాళ్ళే ఎక్కువగా వీళ్ళని ట్రోలింగ్ చేస్తుంటారనుకోండి. అది వేరే విషయం. ఇంతకీ ట్రోలింగ్ బారిన పడ్డ భారీ అందాల భామలెవరో తెలుసుకుందామా మరి..

అన్వేషి జైన్..

హార్మోన్ల సమస్యతో తన శరీరంలో కొన్ని భాగాలు అనూహ్యంగా పెరిగిపోయాయని పలు సందర్భాల్లో చెప్పింది ఈ సోషల్ మీడియా సెన్సేషన్. చాలామంది తనను చిన్న వయసులోనే ఆ భారీ అందాల కారణంగా చులకనగా చూసేవాళ్ళనీ, వాళ్ళ చూపులు భరించలేక, ఇంట్లోంచి బయటకు రాలేకపోయాననీ చెబుతుంటుంది అన్వేషీ జైన్. అయితే, తన బలహీనతను పక్కన పెట్టి, తన ఆత్మవిశ్వాసాన్నే అసలు బలంగా భావించి, గ్లామరస్ ప్రపంచంలో రాణించగలుగుతున్నానని అన్వేషి తాజాగా వెల్లడించింది. అన్వేషి జైన్ సోషల్ మీడియాలో నిర్వహించే లైవ్ కోసం.. వేలాది మంది లక్షలాది మంది ఎదురుచూస్తుంటారు. అదీ ఆమె ప్రత్యేకత. తెలుగులోనూ ఓ సినిమాలో నటించిందీ భామ.

అయేషా టకియా

కింగ్ అక్కనేని నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘సూపర్’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాలో అనుష్క శర్మ ఓ హీరోయిన్ కాగా, బొద్దుగుమ్మ అయేషా టకియా మరో హీరోయిన్. అనుష్క నాజూగ్గా వుంటే, మరీ ఓవర్ బొద్దుతనంతో అయేసా టకియా చాలా విమర్శలు ఎదుర్కొంది. హార్మోన్ల సమస్య కారణంగానే ఆమె అంతలా బరువు పెరిగిపోయింది. ఆ బరువే ఆమెకు శాపంగా మారి, సినిమాల్ని వదిలేయాల్సి వచ్చింది. బరువు తగ్గించేందుకు శస్త్ర చికిత్సల్ని ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోయిందామెకి. సోషల్ మీడియాలో ఆమెను ఇప్పటికీ విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు.

సమీరా రెడ్డి..

వెండితెరపై కాస్త బొద్దుగా కనిపించినా, ‘ఫిట్’గానే వుండే సమీరారెడ్డి, పెళ్ళయ్యాక.. రెండోసారి గర్భం దాల్చాక తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొంది.. పెరిగిపోయిన ఫిజిక్ కారణంగా. తనపై వమర్శలు చేసేవారికి ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్లో సమాధానమివ్వడమే కాదు, ఏకంగా టూ పీస్ బికినీలో తన బేబీ బంప్ ప్రదర్శిస్తూ పొటోలకు పోజులిచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సన్నబడే ప్రయత్నాల్లో వుంది సమీరారెడ్డి.

ఇలియానా..

అసలు ఇలియానా విషయంలో బాడీ షేమింగ్ చేయడానికి ఏముంటుంది.? అంటే, ‘కిక్’ సినిమా సమయంలో ఆమె కొంత బొద్దుగా మారేసరికి, విమర్శలొచ్చాయ్ బాగానే. అంతే కాదు, ఆ మధ్య బాయ్ ఫ్రెండ్ దూరమయ్యాక ఇలియానా మానసిక సమస్యలతో బాధపడుతూ, అనుకోకుండా బరువు పెరిగేసరికి ఆమెను భయంకరంగా ట్రోల్ చేశారు. నిజానికి, తాను ఈ తరహా వేధింపులు చిన్నప్పుడే
ఎదుర్కొన్నాననీ, తన బ్యాక్ పార్ట్ చాలా పెద్దదిగా వుండేదనీ ఇలియానా తాజాగా చెప్పుకొచ్చింది. నాజూకు నడుమందానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఇలియానాకి ఇలాంటి సమస్యా.? ఆశ్చర్యకరమే మరి.

కేతిక శర్మ

తొలి సినిమా ‘రొమాంటిక్’ విడుదల కాకుండానే బొద్దుగుమ్మ కేతిక శర్మ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ బారిన పడాల్సి వచ్చింది. పూరి జగన్నాథ్ నిర్మతగా తెరకెక్కించిన ‘రొమాంటిక్’ సినిమలో పూరి ఆకాష్ హీరో. ఆకాష్ – కేతికల మధ్య రొమాన్స్.. సినిమా ప్రోమోల్లో మాంఛి కిక్ ఇచ్చాయంతే. ఆ కిక్కు సంగతి తర్వాత.. సోషల్ మీడియాలో కేతిక ఫొటోలకి వున్న క్రేజ్, వ్యతిరేకత.. అంతా
ఇంతా కాదు.

నిత్యా మీనన్

మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ మంచి నటి. అయితే, బొద్దుతనం కాస్త ఎక్కువ. ఆ బొద్దుతనమే ఒక్కోసారి ఆమెకు శాపంగా మారుతుంటుంది. జుగుప్సాకరమైన కామెంట్లు ఆమెకు సోషల్ మీడియాలో ఎదురవుతుంటాయి. అవన్నీ డోన్ట్ కేర్ అంటుంది నిత్యామీనన్. నా ఫిజిక్.. నా ఇష్టం.. అని బల్లగుద్ది ఎన్నిసార్లు చెప్పినా, నిత్యామీనన్ మీద ట్రోలింగ్ అలా కొనసాగుతూనే వుంటుంది.

రాశి

 

కాస్త వెనక్కి వెళితే, భారీ అందాల రాశి.. అదేనండీ హీరోయిన్ రాశి కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంది. అయితే, సోషల్ మీడియా అప్పట్లో లేదు. కానీ, కొన్ని పత్రికల్లో ఆమెపై జుగుప్సాకరమైన కథనాలొచ్చేవి. కానీ, ఆమె భారీ అందాలే అప్పట్లో ఆమెకు ఓ అరుదైన ప్రత్యేకతను ఆపాదించాయంటారు కొందరు.

నమిత

హీరోయిన్ నమిత పరిస్థితి కూడా ఇంతే. మొదట్లో నాజూగ్గానే వుండేది. అనూహ్యంగా బొద్దుతనం ఎక్కువైపోయి, భారీ హీరోయిన్ అయిపోయింది. బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలో నమిత డాన్సులు, ఆమె భారీతనంపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఆ విమర్శల నేపథ్యంలో కసరత్తులు గట్టిగా చేసి తగ్గించేద్దామనుకుందిగానీ, వెయిట్ లాస్ అనేది ఆమె వల్ల కాలేదు.

ఒకళ్ళా? ఇద్దరా.? చెప్పుకుంటూ పోతే, ట్రోలింగ్ బాధితులు ఎందరో వున్నారు, ఈ భారీ అందాల వ్యవహారానికి సంబంధించి. ట్రోలింగ్ ట్రెండ్ నడుస్తోంది కదా.. అదోరకమైన పబ్లిసిటీ కొందరికి.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News