Anasuya: అనసూయకు అండగా బడా నిర్మాత.. అందుకే ఈ అమ్మడు ఆగట్లేదా..?

Anasuya: యాంకర్ అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తోంది..

By: jyothi

Published Date - Thu - 6 October 22

Anasuya: అనసూయకు అండగా బడా నిర్మాత.. అందుకే ఈ అమ్మడు ఆగట్లేదా..?

Anasuya: యాంకర్ అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తోంది. మొన్నటివరకు జబర్దస్త్ యాంకర్ గా సత్తా చాటిన ఈ బ్యూటీ..ఒక్కసారిగా ఈటీవీ నుంచి బయటకు వచ్చింది. తనమీద కామెంట్స్ చేయడం నచ్చకనే బయటకు వచ్చినట్టు పేర్కొన్న అనసూయ.. మాటీవీ నుంచి తనకు భారీ ఆఫర్ వచ్చినట్టు మాత్రం బయటకు చెప్పలేదు. ఇక దీనికితోడు ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు ఎక్కువ అయ్యాయట..

అనసూయకు సపోర్టు అతనేనా..

అనసూయ బుల్లితెరయాంకర్ గానే కాకుండా సినిమాల్లోనూ తన సత్తా చాటుతోంది. బుల్లితెరపై హాట్ హాట్ లుక్స్ తో అందాలు ఆరబోయడమే కాకుండా సినిమాల్లోనూ తన గ్లామర్ షోను ప్రదర్శిస్తోంది. జబర్దస్త్ షోలో ఈ అమ్మడి అందాలకు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆ షో రేటింగ్స్ కూడా అనసూయ గ్లామర్ షో వల్లే పెరిగాయని అప్పట్లో టాక్ వచ్చింది.

దీనికి తోడు సోషల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్ తో తన పరువాల విందును ప్రదర్శించిన అనసూయ.. తన కంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇక కొత్త కొత్త డ్రెస్సుల్లో కుర్రకారు మతులు పోగెట్టేది. ఈ మధ్యకాలంలో అనసూయకు సినిమా ఆఫర్స్ చాలా వస్తున్నాయి. దీనికి ఓ బడా నిర్మాత సపోర్టు ఉందని టాక్ వినిపిస్తోంది.

యాంకర్ అనసూయ అటు సినిమాలు, ఇటు బుల్లితెరపై పలు షోలు చేస్తూ చాలా బిజీగా మారిపోయింది. మా టీవీలో కొత్త షో ప్రారంభం అవుతుందని అంతా భావించారు. కానీ అనుకోకుండా అది క్యాన్సల్ అయ్యిందట.. మొన్నటివరకు క్షణం, సోగ్గాడే చిన్నినాయన, పుష్ప, తాజాగా పుష్ప-2 సినిమా చేస్తున్న అనసూయకు.. ఇతర ఆఫర్లు కూడా వస్తున్నాయట.. ఇక ఈ బ్యూటీకి ఆఫర్లు ఇప్పించేందుకు ఓ బడా నిర్మాత తెగ ట్రై చేస్తున్నారట.. ఆయన మరెవరో కాదు.. పీవీపీ అని టాక్ వినిపిస్తోంది.

Read Also : Smart phones : ధమాకా అఫర్.. రూ.7వేల లోపే వస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్..

Read Also : Vastu Shastra : ఇంట్లో ఈ దిక్కులో లక్ష్మీ దేవి ఫొటో పెడితే 10 రెట్లు ఐశ్వర్యం కలుగుతుంది..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News