Varun Tej : ఆ ఒక్క సినిమా చేసుంటే వరుణ్ తేజ్ స్టార్ హీరో అయ్యేవాడే.. బ్యాడ్ లక్..!

Varun Tej : బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. కొత్త హీరో అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా చేసినా ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది..

By: jyothi

Updated On - Sun - 7 May 23

Varun Tej : ఆ ఒక్క సినిమా చేసుంటే వరుణ్ తేజ్ స్టార్ హీరో అయ్యేవాడే.. బ్యాడ్ లక్..!

Varun Tej : మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఎందుకంటే ఆయన విభిన్నమైన స్టోరీలను మాత్రమే ఎంచుకుంటాడు. రొటీన్ కథలను కాకుండా.. డిఫరెంట్ గా ఉండే కథలతోనే సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పైగా పాత్రలను ఛాలెంజింగ్ గా తీసుకునే ఏకైక మెగా హీరో కూడా అతనే.

ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో టైర్-2 హీరోగా ఉన్నారు. స్టార్ హీరో అయ్యేందుకు వరుణ్‌ కు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఆ రేంజ్ కు ఎదగట్లేదు. కాగా వరుణ్‌ తేజ్ అప్పట్లో ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడు. ఒకవేళ ఆ సినిమా గనక చేసి ఉంటే ఈరోజు ఆయన రేంజ్ వేరే లెవల్ లో ఉండేదంట.

ఆ సినిమా ఏదో కాదండోయ్.. ఉప్పెన. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. కొత్త హీరో అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా చేసినా ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా కథను మొదటగా వరుణ్‌ కు వినిపించాడంట బుచ్చిబాబు.

Varun Tej Rejected Uppena Movie

Varun Tej Rejected Uppena Movie

కానీ ఎందుకో నాగబాబు ఇలాంటి ప్రయోగం చేయొద్దని వరుణ్‌ కు చెప్పడంతో ఆయన రిజెక్ట్ చేశాడు. ఇక అదే కథను వైష్ణవ్ కు చెప్పమని చిరంజీవి సలహా ఇచ్చాడంట. ఆయన ఓకే చేయడంతో సినిమా తెరకెక్కింది. ఇంకేముంది దెబ్బకు వైష్ణవ్ కు గోల్డెన్ ఆఫర్ వచ్చేసింది. ఒకవేళ ఇదే సినిమాను వరుణ్‌ గనక చేసి ఉంటే సినిమా రేంజ్ ఇంకా వేరే లెవల్ లో ఉండేది. ఆయనకు కూడా స్టార్ ఇమేజ్ వచ్చి ఉండేది.

Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Read Also : Rashmika Mandanna : అలాంటి వాడే మొగుడిగా రావాలి.. రష్మిక అతని గురించి ఓపెన్ అయిందిగా..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News