చేతిలో డబ్బు ఉండాలే కాని వయసుతో సంబంధం లేకుండా ఏ పని అయినా చేయవచ్చు అంటూ 18 ఏళ్ల వయసులో ఇప్పటి స్టార్ హీరో సీనియర్ హీరో వెంకటేష్ నిరూపించాడు. 18 ఏళ్ల వయసులో వెంకటేష్ ఏకంగా నిర్మాతగా మారిపోయాడు. తన పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సినిమాను నిర్మించాడు. అప్పటికే రామానాయుడు ఏర్పాటు చేసిన సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నా కూడా పంతం మరియు పట్టుదలతో వెంకటేష్ సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి ఒకే ఒక్క సినిమాను నిర్మించాడు. మళ్లీ వెంకటేష్ నిర్మాతగా తన బ్యానర్లో చేసిందే లేదు.
ఒక్క సినిమా కోసం వెంకటేష్ పంతంతో ఎందుకు సొంతంగా బ్యానర్ ఏర్పాటు చేశాడు అనేది ఆసక్తికర విషయం. తన అబిమాన హీరోతో తానే స్వయంగా సినిమాను నిర్మించాలనే పట్టుదలతో వెంకటేష్ తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. 18 ఏళ్ల వయసు వచ్చిన వెంటనే సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. 14, 15 ఏళ్ల వయసు నుండే వెంకటేష్ కు తన అభిమాన నటుడు శోభన్ బాబుతో సినిమాను సొంతంగా నిర్మిచాలని కోరిక. ఆ కోరిక ను 18 ఏళ్ల వయసుకు వచ్చిన వెంటనే నెరవేర్చుకున్నాడు. తండ్రి వద్ద కావాల్సినంత డబ్బు ఉంది.. పలుకుబడి విషయంలో ఎలాంటి లోటు లేదు. దాంతో శోభన్ బాబు డేట్లు లభించడం వెంకటేష్ కు ఇబ్బంది ఏం కాలేదు. అలా సింపుల్ గా 18 ఏళ్ల వయసులోనే వెంకటేష్ నిర్మాతగా సినిమాను నిర్మించేశాడు. ఆ సినిమా విశేషాలు ఏంటో చూసేద్దాం రండీ…
వెంకటేష్ 14వ ఏట ఉన్నప్పుడే అప్పటి స్టార్ హీరో శోభన్ బాబు అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టం తో శోభన్ బాబును ఎన్నో సార్లు కలిశాడు.. మాట్లాడాడు.. అయినా కూడా తనలోని అభిమాని ఇంకా ఏదో కోరుకుంటున్నదంటూ వెంకటేష్ తన తండ్రి రామానాయుడు వద్ద పలు సందర్బాల్లో చెప్పాడట. ఒక సారి శోభన్ బాబు గారితో సినిమా ను తీస్తానంటూ తండ్రి రామానాయుడు వద్ద వెంకటేష్ చెప్పాడట. వెంటనే ఓహ్ అదెంత భాగ్యం శోభన్ బాబు మనం ఎప్పుడు అడిగే అప్పుడు మన బ్యానర్ లో నటించేందుకు సిద్దంగా ఉంటాడు. ఆయన తో కొత్త సినిమాను మన బ్యానర్ లో నువ్వే నిర్మించుదువు గాని అన్నాడట. కాని వెంకటేష్ అలా కాదు తానే సొంతంగా బ్యానర్ ను ఏర్పాటు చేస్తానంటూ రామానాయుడు తో అన్నాడట. వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ ను వెంకటేష్ ప్రారంభించడం ఆ బ్యానర్ లో సినిమాను ప్రారంభించడం చేశాడు. ఎంకి – నాయుడు బావ అనే టైటిల్ తో శోభన్ బాబు మరియు వాణిశ్రీ జంటగా వెంకటేష్ సినిమాను నిర్మించాడు. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించాడు. డబ్బు పెట్టింది అంతా కూడా రామానాయుడు అయినా కూడా నిర్మాత డి వెంకటేష్ అంటూ పడింది.
18 ఏళ్ల వయసులోనే నిర్మాతగా పేరు వేయించుకున్న ఘనత వెంకటేష్ కు దక్కింది. ఇప్పటి వరకు మరెవ్వరు కూడా అంత చిన్న వయసులో నిర్మాతగా సినిమా చేసిందే లేదు. ఇన్నాల్లు అయినా కూడా వెంకీ మామ రికార్డును బ్రేక్ చేసిన వారు రాలేదు. శోభన్ బాబుతో సినిమాను నిర్మించిన సమయంలో వెంకటేష్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచనే లేదట. కేవలం ఇండస్ట్రీలో శోభన్ బాబుతో సినిమాను నిర్మించి దూరంగా వెళ్లి పోవాలనుకున్నాడట. కాని అనుకోని పరిస్థితుల్లో వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. హీరో వెంకటేష్ హీరోగా ఇచ్చిన నాటకీయ పరిస్థితులు మరియు పరిణామల గురించి మరో వీడియోలో చర్చిద్దాం…