venkatesh :టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేశ్ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. టాప్, సీనియర్ హీరోల్లో ఆయన ఒకరు. ముందు నుంచీ ఫ్యామిలీ మూవీస్‌కు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ వస్తున్నాడు వెంకటేశ్. వివాదాలకు ఈయన చాలా దూరమనే చెప్పాలి. ఇటీవలే ఆయన యాక్ట్ చేసిన మూవీ నారప్ప ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆయన మరో చిత్రం దృశ్యం 2 సైతం ఓటీటీలోనే రిలీజ్ కానుంది. అంతకు ముందు వచ్చిన దృశ్యం మూవీకి ఇది సీక్వెల్. అయితే ముందు నుంచీ ఫ్యామిలీ ఓరియెంటెండ్ ఫిలిమ్స్ చేస్తున్న వెంకటేశ్‌కు ఫ్యామిలీ ఫ్యాన్సే ఎక్కువ. అందులో మహిళలే ఎక్కువగా ఉంటారు. తన తండ్రి రామానాయుడు, అన్న సురేశ్ ఇండస్ట్రీకి చెందిన వారే. వీరి కామినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. అందులో చాలా మూవీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ప్రస్తుతం ఆయన ఎఫ్ 3 మూవీలో నటిస్తున్నారు. అనిల్ రావుపుడి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఎఫ్ 2కు సీక్వెల్. ఇందులో మరో హీరోగా వరుణ్ తేజ సైతం నటిస్తున్నాడు. అయితే తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో వెంకటేశ్ ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగానే రామ్ తో కలిసి మసాలా, మహేశ్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 వంటి మూవీస్ చేశారు. నారప్ప, దృశ్యం 2 మూవీలో ఓటీటీలో రిలీజ్ కాగా, ఎఫ్ 3 మాత్రం థియేటర్స్ లో సందడి చేయనుందని చెబుతున్నారు ఫిలిమ్ మేకర్స్.
venkatesh
ఇదిలా ఉండగా ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఎప్పుడు బయట కనిపించరు. ఆయన భార్య పేరు నీరజ. వెంకటేశ్‌కు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. బీజేపీ లీడర్ కామినేని శ్రీనివాస్ కు నీరజ మేనకోడలు అవుతుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ లీడర్ పెండ్యాల అచ్చిబాబు వెంకటేశ్‌కు తోడల్లుడు కావడం విశేషం. కొవ్వూరి జమిందారి ఫ్యామిలీకి చెందిన అచ్చిబాబు.. టీడీపీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కొవ్వూరు కాన్సిటెన్సీ తో పాటు జిల్లా.. గోపాలపురం, పోలవరం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండే వారు. అచ్చిబాబు సోదరుడు కృష్ణారావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ప్రాంతానికి షూటింగ్ కోసం వెంకటేశ్ ఎప్పుడు వెళ్లిన అచ్చిబాబుకు సంబంధించిన గెస్ట్ హౌస్‌లోనే ఉంటారు.
venkatesh-wife