Vidyullekha Raman : ప్రముఖ నటుడు మోహన్ రామ్న్ కుమార్తె అయిన విద్యుల్లేఖ గురించి అందరికీ బాగా తెలుసు. లేడీ కమెడియన్ గా ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె 2012లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన `ఎటో వెళ్ళిపోయింది మనసు` మూవీతో ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత కూడా ఆమె చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
ఎక్కువగా కామెడీ పరమైన సినిమాల్లోనే నటించింది. కాగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను కూడా ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ కామెంట్లు ఎదుర్కున్నాను. నన్ను పంది, ఏనుగు అంటూ దారుణంగా కామెంట్లు చేశారు.
అప్పట్లో నేను పెండ్లి చేసుకుని నా భర్తతో హనీమూన్ కు వెళ్లాను అప్పుడు బికినీ వేసుకుని బీచ్ లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాను. అవి చూసి అందరూ నన్ను తిట్టారు. నువ్వు అసలు అమ్మాయివేనా అంటూ అడిగారు. నువ్వు నీ భర్తతో ఎప్పుడు విడాకులు తీసుకుంటావు అని దారుణంగా విమర్శించారు.
దానికి నేను చాలా బాధ పడ్డాను. ఆ మాటలు నా మనసుకు గుచ్చుకుంటున్నాయి. కానీ నేను వాటిని ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు. నా భర్తతో చాలా హ్యాపీగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది విద్యుల్లేఖ.
Read Also : Actress : యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్న సమంత సిస్టర్.. ఎంత మందిని చేస్తావమ్మా..!
Read Also : Ramya krishna : రమ్యకృష్ణను లైంగికంగా వేధించిన స్టార్ డైరెక్టర్.. చివరకు దారుణం..!