Pan India Number One Hero: ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు పాన్ ఇండియా వైపు చూస్తున్నాయి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లందరూ కలిసి తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాన్ ఇండియా పేరే మార్మోగిపోతోంది. అయితే ఈ పాన్ ఇండియా స్టార్లలో ఎవరు ముందున్నారన్నదాని గురించే చర్చ జరుగుతోంది.
అయితే ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహంచి ఈ లిస్టును రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరో లిస్టు బయటకు వచ్చింది. ఇందులో ఎవరు నెంబర్ వన్ అనే విషయం తెలిస్తే నిజంగా అందరూ షాక్ అయిపోతారు. మొన్నటి వరకు ఈ ఆస్టులో మన తెలుగు హీరోలే నెంబర్ వన్ పొజీషన్ లో ఉండేవారు. కానీ తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ ఈ స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఆగస్టు నెలకు సంబంధించిన ఈ లిస్టును రిలీజ్ చేశారు. ప్రతి నెలా సర్వే నిర్వహించే ఆర్మాక్స్ మీడియా గత నెల లిస్టును కూడా రిలీజ్ చేసింది. ఈ లిస్టులో విజయ్ తర్వాత ప్రభాస్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు. గత నెలలో ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. కానీ ఈ సారి మూడో స్థానానికి పడిపోయాడు.
ఇక నాలుగో స్థానంలో బన్నీ ఉన్నాడు. ఐదో స్థానంలో కన్నడ హీరో యష్ నిలిచాడు. తర్వాత వరుసగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, రామ్ చరణ్, మహేష్ బాబు, సూర్య, అజిత్ లు ఉన్నారు. మరి తర్వాత నెల ఎవరు ఉంటారో చూడాలి.
Also Read: Chiranjeevi: చిరంజీవికి కాంగ్రెస్ ఐడెంటిటీ కార్డ్ జారీ
Also Read : SR NTR-Balayya : బాలయ్యతో ఆ హీరోయిన్ కాళ్లు మొక్కించిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?