ప్రపంచంలో ఏ హీరోయిన్‌ కు దక్కని అరుదైన రికార్డ్‌ విజయశాంతి సొంతం.. అవి ఏంటో తెలుసా?

  తెలుగు ప్రేక్షకులకు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు విజయశాంతి. లేడీ అమితాబ్ గా పేరు పొంది లేడీ సూపర్‌ స్టార్‌ గా దశాబ్ద కాలం పాటు వెలుగు వెలిగిన విజయశాంతి కొన్ని వందల కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్‌ గా నటించి మెప్పించారు. మెగాస్టర్‌ చిరంజీవి మొదలుకుని నాగార్జున వరకు ఎంతో మంది స్టార్స్‌ తో పదుల కొద్ది సినిమాలు చేసింది. హీరోలకు జోడీగా గ్లామర్‌ డాల్‌ పాత్రల్లో ఆమె నటిస్తూనే […].

By: jyothi

Updated On - Sat - 21 August 21

ప్రపంచంలో ఏ హీరోయిన్‌ కు దక్కని అరుదైన రికార్డ్‌ విజయశాంతి సొంతం.. అవి ఏంటో తెలుసా?

 

తెలుగు ప్రేక్షకులకు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు విజయశాంతి. లేడీ అమితాబ్ గా పేరు పొంది లేడీ సూపర్‌ స్టార్‌ గా దశాబ్ద కాలం పాటు వెలుగు వెలిగిన విజయశాంతి కొన్ని వందల కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్‌ గా నటించి మెప్పించారు. మెగాస్టర్‌ చిరంజీవి మొదలుకుని నాగార్జున వరకు ఎంతో మంది స్టార్స్‌ తో పదుల కొద్ది సినిమాలు చేసింది. హీరోలకు జోడీగా గ్లామర్‌ డాల్‌ పాత్రల్లో ఆమె నటిస్తూనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను కూడా చేసి మెప్పించింది. విజయశాంతి లేడీ ఓరియంటెడ్ గా చేసిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్‌ లు గా నిలిచాయి. స్టార్‌ లు సూపర్‌ స్టార్‌ల సినిమాలను పక్కకు నెట్టి మరీ విజయశాంతి నటించిన సినిమాలు భారీ వసూళ్లను నమోదు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి రెండు అరుదైన సంఘటనలను గురించి ఇప్పుడు చూద్దా రండీ…
స్టార్‌ హీరోలకు మాత్రమే మాస్ లో మంచి ఫాలోయింగ్‌ ఉండి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే రోజులు అవి. కమర్షియల్‌ సినిమాలు రాజ్యం ఏలుతున్న ఆ రోజుల్లో లేడీ సూపర్‌ స్టార్ విజయశాంతి దక్కించుకున్న సక్సెస్ లు రికార్డులు ఇండియన్‌ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచంలోనే ఏ హీరోయిన్‌ కూడా దక్కించుకుని ఉండదు. సూపర్‌ స్టార్‌ లను సైతం వెనక్కు నెట్టి రికార్డులను నమోదు చేసిన ఘనత విజయశాంతికి దక్కుతుంది. చిరంజీవి, కృష్ణ, వెంకటేష్‌, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోల సినిమాలకు పోటీగా నిలిచి రెండు సంవత్సరాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలను అంధించిన ఘనత విజయశాంతికి దక్కింది.
1985 అక్టోబర్‌ 11న విజయశాంతి నటించిన ప్రతిఘటన సినిమా విడుదల అయ్యింది. మొదట లేడీ ఓరియంటెడ్‌ సినిమా అవ్వడంతో జనాలు పట్టించుకుంటారా లేదా అనే అనుమానం వ్యక్తం అయ్యింది. విడుదల అయిన వారం రోజుల్లో మౌత్‌ టాక్‌ తో నభూతో నభవిష్యతి అన్నట్లుగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రానికి వసూళ్లు నమోదు అయ్యాయి. అదే ఏడాది సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్ని పర్వతం మరియు వజ్రాయుదం సినిమాలు సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాయి. అదే ఏడాదిలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా కూడా విడుదల అయ్యింది. ఈ మూడు సినిమాలు భారీ వసూళ్లను దక్కించుకున్నా కూడా ఆ ఏడాదిలో ఈ మూడు సినిమాలు కూడా నెం.1 గా నిలువలేదు. 1985 లో అత్యధక వసూళ్లు సాధించిన సినిమాగా ప్రతిఘటన నిలిచింది.
ప్రతిఘటన వచ్చిన 12 ఏళ్ల తర్వాత విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన ఒసేయ్ రాములమ్మ వచ్చింది. 1997 లో మళ్లీ 1985 సీన్ రిపీట్ అయ్యింది. ఆ ఏడాదిలో పలు పెద్ద హీరోల సినిమాలు వచ్చినా కూడా రాములమ్మ సినిమా టాప్ చిత్రంగా నిలిచింది. 1997 లో చిరంజీవి నటించిన హిట్లర్ మరియు మాస్టర్ సినిమాలు ఇంకా నాగార్జున నటించిన అన్నమయ్య బాలకృష్ణ పెద్దన్నయ్య వెంకటేష్‌ ప్రేమించుకుందాం రా సినిమాలు వచ్చాయి.
ఇవన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలే అయినా కూడ ఆ ఒసేయ్‌ రాములమ్మ వసూళ్లను ఈ సినిమాలేవి బీట్ చేయలేక పోయాయి. 1997 సంవత్సరంలో టాలీవుడ్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఒసేయ్‌ రాములమ్మ నిలిచింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్‌ లో అయినా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా స్టార్‌ హీరోల సూపర్‌ హిట్ చిత్రాల వసూళ్లను క్రాస్‌ చేసి దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కాని విజయశాంతి ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు ఆ ఫీట్ ను సాధించింది. రాబోయే రోజుల్లో కూడా రాములమ్మ రికార్డులను ఎవరు బ్రేక్‌ చేయలేక పోవచ్చు.

Tags

Latest News

Related News