Anu Mehta: అల్లు అర్జున్ హిట్ మూవీ ఆర్య హీరోయిన్ ఏమైపోయింది..

Anu Mehta: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ప్రొడ్యూసర్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్య ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు అప్పటికే అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా విజయం సాధించింది అయిన కూడా ఆ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు పెద్దగా గుర్తింపు రాలేదు దాంతో రెండో సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ […].

By: jyothi

Published Date - Fri - 15 October 21

Anu Mehta: అల్లు అర్జున్ హిట్ మూవీ ఆర్య హీరోయిన్ ఏమైపోయింది..

Anu Mehta: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ప్రొడ్యూసర్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్య ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు అప్పటికే అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా విజయం సాధించింది అయిన కూడా ఆ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు పెద్దగా గుర్తింపు రాలేదు దాంతో రెండో సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి అయిన అనురాధ మెహతా గారిని తీసుకున్నారు.

ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం జరిగింది దేవి అందించిన సాంగ్స్ లో ప్రతి సాంగ్ ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రేంజ్ లో ఇచ్చాడు సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది దాంతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు అలాగే సుకుమార్ కూడా స్టార్ దర్శకుడిగా ఎదిగాడు దిల్ రాజు బ్యానర్లో రెండో హిట్ గా ఆర్య నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ రామ్ హీరోగా జగడం సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అయితే ఆర్య సినిమాలో నటించిన అను మెహతా ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ , ఆర్యన్ రాజేష్ హీరోలుగా నువ్వంటే నాకిష్టం అనే సినిమాని తెరకెక్కించారు ఆ సినిమాలో హీరోయిన్ గా అను మెహతా గారిని తీసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు దాంతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన అజయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అజయ్ సినిమా మహేష్ బాబు హీరోగా తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు మూవీ కి రీమేక్ గా తీశారు ఆ సినిమాలో హీరోయిన్ గా అను మెహతా ని తీసుకున్నారు ఈ సినిమా అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 

కన్నడ లో తనకి హీరోయిన్ గా మంచి అవకాశాలు వచ్చాయి కానీ తను చేసిన సినిమాలేవీ సరిగా ఆడకపోవడంతో ఎంత తొందరగా అయితే కన్నడలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారో అంతే తొందరగా డౌన్ ఫాల్ అయిపోయారు.ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు అయినప్పటికీ ఆ సినిమాల ద్వారా ఆవిడకి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో మళ్లీ కన్నడ భాషలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు అక్కడ కూడా హీరోయిన్ గా పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో సినిమాలకి గుడ్ బై చెప్పేశారు కానీ తను ప్రస్తుతం ఎక్కడ ఉంటుంది అనే విషయం ఎవరికీ తెలియట్లేదు ఎందుకంటే ఆవిడ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించడం లేదు దాంతో ఆమె ఆచూకీ ఎవరికీ తెలియడం లేదు. ఆమె ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా తను ఒక సారి సోషల్ మీడియాలోకి వచ్చి ఎలా ఉన్నారో చెప్తే చాలు అన్నట్టుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాక పోయిన తర్వాత అయిన ఆమెకు సినిమాలో మంచి రోల్ వచ్చి అప్పటి హీరోయిన్లు అయిన సంగీత లాంటివారు సరిలేరు నీకెవ్వరు సినిమా తో ఎలాగైతే కం బ్యాక్ ఇచ్చారో అలాగే తను కూడా కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు…

Latest News

Related News