Sudheer Babu: ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత గొప్ప పేరు సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కృష్ణ గారు అని చెప్పాలి అప్పట్లో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి అలాగే ఇండస్ట్రీలో కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయాలన్న కూడా కృష్ణ గారే ముందుండేవారు అలాంటి కృష్ణ సింహాసనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో నెంబర్ వన్ రేసులో నిలబడ్డాడు.అయితే కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అనతి కాలంలోనే సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఆ తర్వాత వచ్చిన అతడు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టాడు ఆ తర్వాత పూరి దర్శకత్వంలో పోకిరి సినిమాతో మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు మహేష్ బాబు, ఆ తర్వాత వచ్చిన దూకుడు బిజినెస్ మెన్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టిన హీరోగా గుర్తింపు పొందాడు అలాగే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా తో బిజీగా ఉన్నాడు
.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అయితే కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు మొదటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన ఏ మాయ చేశావే సినిమాలో సమంత అన్న గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని SMS సినిమాతో హీరోగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు అయినప్పటికీ నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ చిత్రం సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమా కూడా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో నాని విలన్ గా సుధీర్ బాబు హీరోగా వచ్చిన వి సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని సాధించనప్పటికీ సుధీర్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అయితే సుధీర్ బాబు ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు అలాగే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వర్షం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు ఆ సినిమాలో విలన్ గా సుధీర్ బాబు నటించి బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తనదైన నటన తో మెప్పించాడు. సుధీర్ బాబు సినిమాల్లోకి రాకముందు పురుగుల మందు బిజినెస్ లు చూసుకుంటూ ఉండేవారు అలాగే సినిమా డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించాడు తనకు ఆ బిజినెస్ బోర్ కొట్టడంతో కొత్తగా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు సినిమాల్లోకి వచ్చేటప్పుడు కూడా వాళ్ల మామయ్య కృష్ణ , వాళ్ళ బావ అయిన మహేష్ బాబు రికమండేషన్ ఏమీ లేకుండా తనంతట తాను సినిమాల్లోకి వచ్చి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఒకానొక సందర్భంలో కృష్ణ , మహేష్ బాబు రికమండేషన్ తీసుకోవచ్చు కదా అని అడిగిన ప్రశ్నకు సుధీర్ బాబు సమాధానం గా వాళ్ల రికమండేషన్ తీసుకుంటే నేను వాళ్ళ దగ్గరనుంచి వాళ్ల ఆడపడుచుని పెళ్లి చేసుకున్నందుకు నేను వాళ్ళ దగ్గర నుంచి కట్నం తీసుకున్నట్లు అవుతుంది అని సమాధానం చెప్పాడు.