Chiranjeevi : శరత్ బాబు హీరోగా, చిరంజీవి విలన్ గా నటించిన మూవీ ఏదో తెలుసా..?

Chiranjeevi : చిరు మొదట్లో సైడ్ పాత్రలు, విలన్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఆ సమయంలో కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన 47 రోజులు సినిమాలో శరత్ బాబు హీరో పాత్రను చేశారు..

By: jyothi

Updated On - Wed - 24 May 23

Chiranjeevi : శరత్ బాబు హీరోగా, చిరంజీవి విలన్ గా నటించిన మూవీ ఏదో తెలుసా..?

Chiranjeevi  : సీనియర్ నటుడు శరత్ బాబు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ స్టార్ హీరో మాత్రం కాలేకపోయారు.

తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి తెలుగు, తమిళం, మలయాళంలో కలిపి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. అయితే శరత్ బాబు హీరోగా, చిరంజీవి విలన్ గా కూడా ఓ సినిమా చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే సమయానికే శరత్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్నారు.

చిరు మొదట్లో సైడ్ పాత్రలు, విలన్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఆ సమయంలో కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన 47 రోజులు సినిమాలో శరత్ బాబు హీరో పాత్రను చేశారు. ఇందులో నెగెటివ్ రోల్ ను చిరంజీవి చేశారు. ఇందులో జయప్రద హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అప్పట్లో మంచి హిట్ అయింది.

When Chiranjeevi Entered Industry Sarath Babu Doing Films As Hero

When Chiranjeevi Entered Industry Sarath Babu Doing Films As Hero

తమిళంలో రిలీజ్ చేయగా.. అక్కడ కూడా పెద్ద హిట్ అయింది. ఇందులో శరత్ బాబు పాత్రకు ఎంతమంచి పేరు వచ్చిందో.. చిరు పాత్రకు కూడా అంతే మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే.

Read Also : Anchor Sreemukhi : వాడి వల్ల చనిపోదామనుకున్నా.. శ్రీముఖి జీవితంలో ఇంత విషాదమా..!

Read Also : Chiranjeevi : చిరంజీవి తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News