• Telugu News
  • movies

Tollywood Directors: తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్లు ముందు ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారో మీకు తెలుసా…?

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఒక సినిమాని బాగా తీసి హీరోలకు మంచి పేరు తీసుకురావాలి అంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది అలాంటి డైరెక్టర్ తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులకు చేరువ చేసే క్రమంలో కథకి అనుకూలంగా హీరో ని ఎలా వాడుకోవాలో అలా వాడితేనే హీరోల్లో నటనని బయటికి తీసిన వారు అవుతారు మన తెలుగులో ఉన్న దర్శకులు ఎవరు ఎవరు దర్శకత్వం […].

By: jyothi

Published Date - Wed - 25 August 21

Tollywood Directors: తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్లు ముందు ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారో మీకు తెలుసా…?

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఒక సినిమాని బాగా తీసి హీరోలకు మంచి పేరు తీసుకురావాలి అంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది అలాంటి డైరెక్టర్ తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులకు చేరువ చేసే క్రమంలో కథకి అనుకూలంగా హీరో ని ఎలా వాడుకోవాలో అలా వాడితేనే హీరోల్లో నటనని బయటికి తీసిన వారు అవుతారు మన తెలుగులో ఉన్న దర్శకులు ఎవరు ఎవరు దర్శకత్వం చేయడానికి ముందు ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు ఒకసారి తెలుసుకుందాం…

కృష్ణవంశీ – వర్మ
గులాబీ సినిమాతో ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా పరిచయమైన కృష్ణవంశీ తనదైన మార్క్ డైరెక్షన్ చూపిస్తూ ఇండస్ట్రీపై తన ముద్రను వేశాడు అయితే కృష్ణవంశీ గులాబీ సినిమాకి ముందు రాంగోపాల్ వర్మ దగ్గర శివ సినిమాకి దర్శకత్వం విభాగంలో అసిస్టెంట్ గా పని చేశాడు ఆ తర్వాత తనే ఒక మంచి స్క్రిప్టు రాసుకుని చక్రవర్తి ని హీరోగా పెట్టి గులాబీ సినిమా తీసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు ఆ తర్వాత నాగార్జునతో నిన్నే పెళ్లాడతా లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ ని ఎంచుకొని అప్పటివరకు లేనివిధంగా నాగార్జునని కొత్త గా చూపిస్తూ మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు…

పూరి – వర్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పూరి జగన్నాథ్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తో తీసిన మొదటి సినిమా బద్రి సినిమా నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు ఆయన తీసిన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యమైన అంశాన్ని చెబుతూనే ఉన్నారు ముఖ్యంగా హీరోల క్యారెక్టరైజేషన్ కి సంబంధించి వారికి కొత్త లుక్ ను ఇవ్వడంలో పూరి తర్వాతే ఎవరైనా అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పోకిరి తో మహేష్ బాబుకి కొత్త లుక్ ఇచ్చాడు, అలాగే బుజ్జిగాడు తో ప్రభాస్ ని అంతకు ముందు చూడని విధంగా ఒక గ్రేస్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేశాడు అలాగే ఇష్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ని కూడా ఒక డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేస్తూ తన దైన శైలిలో మాస్ క్యారెక్టరైజేషన్ లో చూపించాడు.అలాంటి పూరి వర్మ దగ్గర సినిమాలకు పని చేయకపోయిన ఆయన చేసిన సినిమాకి అబ్జర్వేషన్ చేయడానికి వెళ్తూ ఉండేవాడు తర్వాత తనే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎదిగాడు…

రాజమౌళి – రాఘవేంద్ర రావు
తెలుగులో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా గుర్తింపు పొందాడు బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఒకే ఒక దర్శకుడు రాజమౌళి అలాగే రాజమౌళి సినిమాకి డైరెక్షన్ చేసే కంటే ముందు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ విభాగంలో అసిస్టెంట్ గా పని చేశాడు.
సుకుమార్ – వివి వినాయక్
ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సుకుమార్ ఆ తర్వాత వరుస విజయాలతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు అయితే సుకుమార్ దిల్ సినిమా సమయం లో వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు…

హరీష్ శంకర్ – వర్మ
హరీష్ శంకర్ వర్మ దగ్గర దర్శకత్వ విభాగంలో మొదట పనిచేశాడు ఆ తర్వాత వర్మ ప్రొడ్యూసర్ గా మారి హరీష్ శంకర్ చేత షాక్ అనే సినిమా తీయించాడు అది ఫ్లాప్ గా మిగిలింది దాంతో హరీష్ శంకర్ పూరి జగన్నాథ్ దగ్గర చిరుత, బుజ్జిగాడు సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత రవితేజతో మిరపకాయ్ అనే సినిమాని డైరెక్ట్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు…

Latest News

Related News