Chiranjeevi-Anasuya: చిరంజీవి మీద అలిగిన అనసూయ.. నన్ను మర్చిపోయారంటూ?

Chiranjeevi-Anasuya: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది..

By: jyothi

Published Date - Thu - 6 October 22

Chiranjeevi-Anasuya: చిరంజీవి మీద అలిగిన అనసూయ.. నన్ను మర్చిపోయారంటూ?

Chiranjeevi-Anasuya: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం చిరు చాలా కష్టపడ్డాడు. దీనికి తోడు మూవీ మీద అంచనాలు కూడా ఎక్కువగానే పెట్టుకున్నారు.ఆచార్య మూవీ డిజాస్టర్ కావడంతో ఈ సినిమా విజయంపై మెగా అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.అనుకున్న విధంగా సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

అనసూయ బుంగమూతి పెట్టుకుందా..

గాడ్ ఫాదర్ మూవీని జనాల్లోకి తీసుకుని వెళ్లేందుకు చిత్రబృందం ప్రమోషన్ భారీగా నిర్వహించిన విషయం తెలిసిందే. మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ మూవీకి తెలుగు రీమెక్ గాడ్ ఫాదర్.. మళయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ ఇందులో నటించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ స్టోరీని తెలుగులో చిరు హీరోగా దర్శకుడు మోహన్ రాజా రీమేక్ చేశారు.

ఈ సినిమాలో బడా స్టార్స్ నటించిన విషయం తెలిసింది. ముందుగా చిరంజీవి చెల్లెలిగా స్టార్ హీరోయిన్ నయనతార నటించింది. విలన్ గా సత్యదేవ్ నటించగా.. సునీల్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్, సుముద్రఖని, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించి అబ్బుర పరిచారు.

ఇదిలాఉండగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ ను అనంతపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ టైంలో వర్షం పడటంతో చిరంజీవి ఎక్కువ సేపు మాట్లాడలేదు.చిరు కోసం అభిమానులు అంతా వర్షంలో నిలబడి ఎదురుచూశారు. చిరు చాలా సేపు మాట్లాడుతారని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా త్వరగా తన ప్రసంగాన్ని ముగించారు. అయితే, సినిమా కోసం పనిచేసిన వారిని చిరు ప్రత్యేకంగా పేర్లు చెబుతున్నప్పుడు అనసూయ గురించి చెప్పలేదట.. అనంతరం అనసూయ చిరును సార్ స్టేజీ మీద నా పేరు చెప్పలేదని అలిగినట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని చిరు ఆ తర్వాత ఓ సందర్భంలో ప్రస్తావించారట.. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read Also : Telugu Heroine : రోజూ రాత్రి ఆ త‌ప్పుడు ప‌ని చేస్తున్న తెలుగు హీరోయిన్.. ఇదేం పాడు బుద్ధి..!

Read Also : Sreemukhi : శ్రీముఖిని ప్రేమ పేరుతో వాడుకుని వ‌దిలేసిన మేల్ యాంక‌ర్‌.. ఇంత క‌థ న‌డిచిందా..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News