8 Legs Baby Cow: కాలజ్ఞానం.. బ్రహ్మంగారు చెప్పిన ఈ భవిష్యవాణి నిజం అవుతూనే ఉన్నాయి. ఉత్తరాన కరోనా పుట్టి లక్షలమంది చస్తారని బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు. ఇక దక్షిణాన సముద్రంలో కడలి పొంగి మరణిస్తారని చెప్పాడు. సునామీ పేరిట అది నిజమైంది. ప్రపంచంలో బ్రహ్మంగారు చెప్పిన వన్నీ జరిగాయి. ఎప్పుడూ చూడని వింతఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
కాలజ్ఞానం నిజమవుతోందా.? బ్రహ్మంగారు చెప్పింది అక్షరాల అక్షరసత్యం అవుతోందా.? పంది కడుపున మనిషి జన్మించాడా.? భవిష్యత్తులో చోటుచేసుకోబోయే అద్భుతాలను ముందే ఊహించి చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఇప్పటికీ చాలామంది నమ్ముతుంటారు.
ఇక బ్రహ్మంగారు తన కాలజ్ఞానంతో బహుకాళ్లతో దూడలు జన్మిస్తాయని..ప్రపంచానికి అది కీడు శకునం అంటూ చెప్పుకొచ్చాడు.. ఇప్పుడు అదే జరిగింది. హిందువులు పవిత్రంగా భావించేది గోవు. లక్ష్మీదేవికి ప్రతీరూపంగా కొలుస్తారు. పూజలు చేస్తారు. గోవుకు సీమంతాలు.పుట్టిన దూడలకు బాలసార కూడా చేస్తారు. గోమాతలను చంపడాన్ని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి కూడా.. హిందూ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో సంరక్షణ కోసం చట్టాలు కూడా చేశారు.
పంది కడుపున వింత జీవులు పుట్టడం చూశాం.. ఆవు పందిపిల్లకు పాలు ఇవ్వడం రకరకాల బ్రహ్మంగారి వింతలు సమాజంలో చోటుచేసుకుంటున్నాయి.
అయితే తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 8 కాళ్లతో ఓ దూడ జన్మించింది. దీంతో ఆ దూడను చూసేందుకు భారీగా చుట్టుపక్కల వారు గుమిగూడారు. సోషల్ మీడియాలో ఆ దూడ ఫొటో పెట్టడంతో వైరల్ గా మారింది. సాధారణంగా రెండు కాళ్లు..లేదంటే ఆరు కాళ్లతో దూడలు జన్మించడం చూస్తాం. 8 కాళ్లతో పుట్టడం చాలా అరుదు. ఈ వింత ఇక్కడ చోటుచేసుకుంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం మురళీనగర్ కు చెందిన ఓ రైతు ఇంట్లో ఈ వింత దూడ జన్మించింది. దేవిశెట్టి రత్నాజీ అనే రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ దూడకు వైద్యపరీక్షలు చేయించారు. జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి దూడలు పుడుతాయని వైద్యులు చెప్పారు. ఇలాంటి దూడలు బతకడం చాలా కష్టం అని అంటున్నారు.
ఇలా బహుకాళ్లతో దూడ పుడితే అరిష్టం అని.. అది ప్రపంచ వినాషనమని బ్రహ్మంగారు ఆనాడు సెలవిచ్చారు. దీంతో ఇప్పుడు మరో ఉపద్రవం తప్పదని.. ఇప్పటికే కరోనాతో లక్షల చావులు చూసిన ప్రపంచం ఇప్పుడు మరో ఉపద్రవానికి రెడీ అవుతోందా? అన్న భయాలు కలుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఈ లేగ దూడ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.
Read Also : 18 Pages Movie : లవ్ స్టోరీ కి ఇంతలా రెస్పాన్స్ వస్తుందనుకోలేదు …. అనుపమ
Read Also : Ananya Panday : స్లిమ్ గా తయారైన లైగర్ పాప….!షాక్ లో ఉన్నా నెటిజన్స్