Marriage Twist: వివాహ బంధంలో ఒక్కోసారి కలహాల కాపురం అనేది కామన్. ఆ తర్వాత సర్దుమనుగొచ్చు కూడా. ఎందుకంటే కలహాలు అనేవి నామమాత్రమే. కానీ తనతో కాపురం చేయకుండా తప్పించుకుంటూ తిరిగే భర్తను.. అబద్ధాలు చెబుతూ నిజాన్ని దాచి మోసం చేయాలనుకునే వ్యక్తిని ఏ భార్య సహించబోదు. అతనితో బంధాన్నితెగదెంపులు చేసుకుంటుంది. లేదా అతని మీద న్యాయపోరాటం చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో వెలుగుచూసింది. తన భర్త మగాడు కాదని తెలిసి షాకైన భార్య పోలీసులను ఆశ్రయించింది.
వడోదరకు చెందిన 40ఏళ్ల మహిళ 2014లో విరాజ్ వర్ధన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, అతను పురుషుడు కాదంట. బాధితురాలు విజైత అనే మహిళ.. విజయ్ వర్ధన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరిద్దరికీ ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. బాధిత మహిళ మొదటి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వీరికి 14 ఏళ్ల కూతురు ఉంది. ఆ తర్వాత 2014లో విజయ్ వర్ధన్‌ను పెళ్లి చేసుకుంది.
వీరిద్దరూ హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్లారు. అయితే, భార్యతో విజయ్ వర్దన్ సన్నిహితంగా లేడు. ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. తన భార్య ఎంక్వైరీ ప్రారంభించగా.. రష్యాలో ఉన్నప్పుడు కొన్నేళ్ల కిందట ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చాడు. నాటి నుంచి శృంగారానికి పనికిరాకుండా పోయానని వెల్లడించాడు. ఆ తర్వాత జరిగిన చిన్న సర్జరీ అనంతరం అంతా సర్దుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఇక 2020 జనవరిలో బరువును తగ్గించుకోవాలనుకుంటున్నట్టు చెప్పి ఆపరేషన్ కోసం కోల్‌కతా వెళ్లాడు. తిరిగి వచ్చాక అసలు నిజం చెప్పాడు. తాను మహిళను అని ఆపరేషన్ చేయించుకుని పురుషుడిగా మారినట్టు చెప్పాడు. దీంతో బాధితురాలు తన భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. అతను తనతో అసహజ శృంగారం చేసేవాడని, తన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
Read Also : Prabhas : కృష్ణం రాజు కూతుర్ల కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. శభాష్ అంటున్న ఫ్యాన్స్..!
Read Also : Krithi Shetty : ఆ కుర్ర హీరోతో కృతి శెట్టి డేటింగ్.. సీక్రెట్ గా మెయింటేన్ చేస్తోందిగా..!