బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఎన్నో సినిమాలతో హిట్లు కొట్టింది. సినిమాల ద్వారా ఆమె కోట్లు సంపాదించింది. లగ్జరీ లైఫ్ ను గడుపుతోంది. అలాంటి విద్యాబాలన్ సడెన్ గా బెగ్గర్ గా మారిపోయింది.
అసలు ఏం జరిగిందో తెలుసుకుందా. తాజాగా విద్యాబాలన్ నటించిన మూవీ ‘నీయత్’. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ తాను గతంలో ఓ సారి బెగ్గర్ గా నటించానని తెలిపింది. మాకు ఐఎంజి అని ఒకటి ఉంది. ఇది భారతీయ సంగీత బృందం.
ప్రతి ఏడాది వీరు సంగీత కచేరీలు చేస్తారు. మూడు రోజులు ఉంటుంది. దానికి నేను వలంటీర్ గా చేశాను. ఆర్గనైజింగ్ కు హెల్ప్ చేసేదాన్ని. అఇయతే ఓ సారి నాకు ఛాలెంజ్ వచ్చింది. ఒబెరాయ్-ది పామ్స్ లోని కాఫీ షాప్ కు వెళ్లి భోజనం కావాలని తలుపు తట్టమని చెప్పారు.
అది ఒక బెగ్గింగ్ ఛాలెంజ్. సరే అని నేను వెళ్లాను. నేను అదే పనిగా ఆ కాఫీ షాప్ డోర్ ను కొట్టాను. అలా కొడితే ప్రజలు ఎలా చిరుకు పడుతారో మీకు తెలుసు కదా. వారు కూడా అలాగే చూశారు నన్ను. ‘ప్లీజ్ నాకు ఆకలిగా ఉంది, నిన్నటి నుంచి ఏమీ తినలేదు’ అని కొడుతూనే ఉన్నాను.
ఇక నా పక్కనే ఉన్న నా స్నేహితుడు సిగ్గుపడి ‘ప్లీజ్ రండి’ అన్నాడు. కానీ నేను పందెం గెలిచాను అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎంతైనా విద్యా బాలన్ చాలా డేరింగ్.. ఇలాంటి పనులు చేయాలంటే చాలా ధైర్యం కావాలి అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
Read Also : Kasturi Shankar Reacts On Casting Couch : వాళ్ల పక్కలో పడుకుంటే స్టార్ డమ్ రాదు.. కస్తూరి శంకర్ సంచలనం..!