Kushboo : సీనియర్ హీరోయిన్ కుష్బూ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె అప్పట్లో ఎన్నో సినిమాలతో తానేంటో నిరూపించుకుంది. చాలా సినిమాలతో ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో ఆమె తెలుగులో కంటే కూడా తమిళంలో చాలా సినిమాల్లో మెరిసింది. దాంతో ఆమెకు అక్కడ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.
ఎంతలా అంటే కుష్బూకు తమిళంలో ఏకంగా గుడులు కట్టేశారు. అంతలా అప్పట్లో ఆమెను ఆరాధించేవారు. కానీ కుష్బూ మాత్రం తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది. అయితే అంత గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న ఆమె కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాలను స్వయంగా ఆమెనే ప్రకటించింది.
అవును.. నేను అప్పట్లో తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడు ఓ స్టార్ హీరో నన్ను కమిట్ మెంట్ అడిగాడు. దాంతోనాకు చాలా కోపం వచ్చింది. ముందు మీ కూతురును కూడా మా తమ్ముడి వద్దకు పంపండి అప్పుడు నేను మీకు కమిట్ మెంట్ ఇస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను.
దాంతో అతని ముఖం వాడిపోయింది. అప్పటి నుంచి అతను నాతో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు అంటూ తెలిపింది కుష్బూ. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కానీ ఆ స్టార్ హీరో పేరు మాత్రం కుష్బూ బయట పెట్టలేదు.
Read Also : Rashmika Mandanna : పంది మాంసం తింటా.. రోజూ రెండు పెగ్గులేస్తాం.. రష్మిక కామెంట్లు వైరల్..!
Read Also : Rashmika Mandanna : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమెను కొట్టేవారే లేరా..?