Actress Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు అనే పేరును అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ సంచలనం సృష్టించింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన అవికా గోర్.. పెదయ్యాక తెలుగులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల సినిమాతో వస్తూనే మంచి హిట్ అందుకుంది.
దీని తర్వాత కూడా ఆమెకు బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో నటిస్తోంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లుచేసింది. ఆమె మాట్లాడుతూ.. నాకు ఏడుసార్లు పెళ్లి చేశారు. కానీ అది నిజంగా కాదు.. `ససురాల్ సీమర్ కా` అనే సీరియల్ లో.
ఇందులో మూడు సార్లు హీరోతో, నాలుగు సార్లు ఇతర క్యారెక్టర్స్ తోనాకు పెళ్లి చేశారు. ఈ సీరియల్ లో చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అందులో నన్ను చనిపోయి బతికినట్టు చూపించారు. పైగా ఆత్మలతో మాట్లాడుతున్నట్టు కూడా చూపించారు. అది తలచుకుంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది.
Actress Avika Gor Got Emotional Talking About Serial In Interview
అసలు ఇంత వరకు అలాంటి సీరియల్ ను నేను ఎప్పుడూ చూడలేదు అంటూ తెలిపింది అవికా గోర్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవికా గోర్ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆమె రీసెంట్ గా నటించిన టెన్త్ క్లాస్ డైరీ సినిమా ప్లాప్ అయింది.
Read Also : Kangana Ranaut : అవును.. గతంలో చాలామందితో డేటింగ్ చేశా.. కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్లు..!
Read Also : Ram Gopal Varma : వ్యభిచారాన్ని తప్పుగా చూడొద్దు.. ఆర్జీవీ ఏంటయ్యా ఈ మాటలు..!