Actress Ester Noronha Reacts On Casting Couch : కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని ఇండస్ట్రీలలో పాతుకుపోయింది. కానీ అది అందరికీ అడ్డుగోడ మాత్రం కాదు. కొందరు దాన్ని తెలివిగా తప్పించుకుని స్టార్లు అవుతున్నారు. కొందరు కమిట్ మెంట్లకు ఒప్పుకున్నాక స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం తమకు అవకాశాలు తగ్గాక దీనిపై మాట్లాడుతున్నారు.
మీటూ ఉద్యమం తర్వాత చాలామంది ఈ కమిట్ మెంట్ల మీద ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా మాట్లాడిన కామెంట్లు కూడా సంచలనం రేపుతున్నాయి. తెలుగులో ఆమె భీమవరం బుల్లోడు, సంస్కార్ కాలనీ లాంటి సినిమాల్లో నటించింది. అయితే తనకు తెలుగులో ఆఫర్లు రాకపోవడానికి కారణాలు తెలిపింది.
నేను తెలుగులో మూడు సినిమాల్లో నటించాను. ఛాన్సులు కావాలని ప్రయత్నించినప్పుడు ఇద్దరు హీరోలు ఛాన్స్ ఇస్తామన్నారు. కానీ వారికి కమిట్ మెంట్ ఇవ్వాలని కండీషన్ పెట్టారు. ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడే ముగిసిపోతుంది.. నీకు ఛాన్సులు రావు అంటూ బెదిరించారు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు.
సినిమా నా ఫాషన్. కానీ సినిమాలే జీవితం కాదు. వేరే ఏ పని అయినా సరే చేసుకుంటాను అని ధైర్యంగా ఉన్నాను. నాకు తెలుగులో ఛాన్సులు రాలేవు కానీ.. కన్నడ నుంచి బాగానే వస్తున్నాయి అంటూ తెలిపింది ఎస్తేర్. అయినా ఆ ఇద్దరు హీరోల పేర్లు మాత్రం ఆమె బయట పెట్టలేదు.