Actress Madhavi Latha : తెలుగు హీరోయిన్ల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం చర్చకు వస్తూనే ఉంటుంది. వారికి టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వకపోవడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ అన్యాయం చేస్తోందనే వాదన ఎప్పటి నుంచో ఉన్నా సరే దానిపై ఎవరూ పెద్దగా స్పందించట్లేదు.
ఇక ఇదే విషయం మీద ఎప్పటి నుంచో తన వాయిస్ ను వినిపిస్తోంది మాధవీ లత. ఆమె గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్లింది. ఇక ఇప్పుడు ఇంటివద్దనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో ఆమె మాట్లాడుతూ.. తెలుగులో అవకాశాలు రావాలంటే కమిట్ మెంట్లు ఇవ్వాలి. కానీ తెలుగు అమ్మాయిలు దానికి సిద్ధంగా ఉండరు. అందుకే బాంబే హీరోయిన్లకు ఛాన్సులు వస్తుంటాయి. ఈ కారణం వల్లనే మన తెలుగు అమ్మాయిలు వెండితెరపై కనిపించకుండా పోతున్నారు.
ఏమైనా అంటే.. మీరు వెళ్లి తమిళంలో ట్రై చేసుకోండి అని అంటున్నారు. తమిళ అమ్మాయిలకు అక్కడ అవకాశాలు ఇస్తున్నారు. కన్నడ అమ్మాయిలకు అక్కడ ఛాన్స్ ఇస్తున్నారు. కానీ మన టాలీవుడ్ లో మాత్రం తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు అంటూ తెలిపింది మాధవీలత.
Read Also : Sara Ali Khan : ఆమెతో నటిస్తే చాలు హీరోలకు పెళ్లైపోతుంది.. ఇంతకీ ఆమె ఎవరంటే..?
Read Also : Nayanthara : డబ్బులిస్తేనే ఆ పని చేస్తా.. ఛీ..ఛీ.. నయనతార నువ్వు మారవా..?