Actress Meena Sensational Comments On Casting Couch : సీనియర్ హీరోయిన్ మీనా ఈ నడుమ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఆమె చేస్తున్న కామెంట్లు మళ్లీ వైరల్ అవుతున్నాయి. భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె కెమెరా ముందుకు పెద్దగా రావట్లేదు. అంతకు ముందు ఆమె వరుస ప్రోగ్రామ్స్.. సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు పెద్దగా బయటకు రావట్లేదు.
అప్పట్లో అగ్ర హీరోయిన్ గా తెలుగు, తమిళ సినిమాల్లో మెరిసింది ఈ భామ. ఆ సమయంలోనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకోవడం.. కూతురు పుట్టాక అనారోగ్య కారణాలతో ఆమె భర్త చనిపోవడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి మీనా కాస్త సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.
ఇక ఆమె గతంలో కాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మా రోజుల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇబ్బంది పెట్టేవారు. వారు ఆడవారితో మాట్లాడే టప్పుడు తమ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారని గుర్తించుకోవాలి. అంతే తప్ప ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు.
హీరోయిన్లు కూడా మారిపోవాలి. అవకాశాల కోసం కక్కుర్తి పడి తప్పుడు పనులు చేయొద్దు. ప్రయత్నాలు చేస్తూ ఓపికగా ఎదురు చూడాలి. మన ట్యాలెంట్ మనకు ఛాన్సులు కచ్చితంగా తెస్తుంది. లక్కీగా నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ఇప్పటి వరకు మంచి మనుషులతోనే పని చేస్తున్నాను అంటూ చెప్పింది మీనా.
Read Also : Mega Fans Are Trolling Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి పాలిట శాపంగా మారిన నిహారిక.. ఎంత పనైపోయింది..!