Actress Pragathi : ఇండస్ట్రీ అన్న తర్వాత ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ లు అనేవి కామన్ అయిపోయాయి. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న వారికి ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి. ఇక మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మంది దీనిపై మాట్లాడుతున్నారు. ఒకప్పుడు వీటిపై మాట్లాడేందుకు భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
చాలామంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా నటి ప్రగతి కూడా ఇలాంటి కామెంట్లు చేసి సంచలనం రేపింది. ఆమె గురించి అందరికీ బాగా తెలుసు. నటి ప్రగతి గతంలో హీరోయిన్ గా చేసింది. కానీ అప్పుడు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.
ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. ఇప్పుడు మాడ్రన్ అమ్మ, అత్త పాత్రలు అంటే టక్కున ప్రగతి మాత్రమే గుర్తుకు వస్తోంది. ఆ రేంజ్ లో ఆమె పాత్రలు చేసింది. కాగా ఆమె కూడా ఈ స్థాయికి వచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు పడిందంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది ఆమె.
ఆమె మాట్లాడుతూ.. నేను కూడా ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కేవలం దర్శకులు, నిర్మాతలే కాకుండా ఓ స్టార్ హీరో కూడా కమిట్ మెంట్ అడిగారు. ఆయనతో రాత్రంతా గడిపితే ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎలాగోలా ఆ హీరో నుంచి బయట పడ్డాను అంటూ తెలిపింది నటి ప్రగతి.
Read Also : Hansika Motwani : వార్నీ.. హన్సిక ఇంత మందితో ఎఫైర్ పెట్టుకుందా.. మామూల్ది కాదురోయ్..!
Read Also : Senior Actress : ప్రొడ్యూసర్ తో సీనియర్ నటి చీకటి సరసాలు.. పైకి పతివ్రతలా బిల్డప్..!