Actress Pragathi Comments On Producer : కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. గతంలో చాలామంది దీన్ని ఎదురించలేక ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత కొందరు వాటిని బయట పెడుతున్నారు. కానీ కాస్టింగ్ కౌచ్ మాత్రం కామన్ అయిపోయింది.
అయితే తాజాగా నటి ప్రగతి కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టేసింది. ఆమె గతంలో హీరోయిన్ గా చాలా ఫేమస్ అయిపోయింది. కానీ ఎక్కువ కాలం సినిమాల్లో హీరోయిన్ గా రాణించలేక పెండ్లి చేసుకుంది. అయితే తాను అలా ఎందుకు పెండ్లి చేసుకోవాల్సి వచ్చిందో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ప్రగతి.
నేను తెలుగు అమ్మాయినే అయినా నాకు తమిళంలో బాగానే అవకాశాలు వచ్చాయి. నేను మంచి సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న సమయంలో ఓ నిర్మాత నన్ను దారుణంగా వేధించాడు. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఓ సినిమాలో నేను హీరోయిన్ గా చేస్తున్నాను. అప్పుడు అతను నా వద్దకు వచ్చి కావాలనే వల్గర్ గా మాట్లాడేవాడు.
నేను పిలిచినప్పుడల్లా నా రూమ్ కు రావాలి. మన సినిమా గురించి డిస్కస్ చేద్దాం అంటూ ఆర్డర్ వేసేవాడు. నాకు చాలా టార్చర్ గా అనిపించింది. అతని వేధింపులు తట్టుకోలేక ఆ మూవీ నుంచే తప్పుకున్నాను. ఆ తర్వాత పెండ్లి చేసుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాను అంటూ తెలిపింది ప్రగతి.