Actress Priyamani Faced Many Problems In Film Industry : సినిమా రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ రాణించాలంటే కచ్చితంగా గ్లామర్ అనేది ఉండాలి. ఇక హీరోయిన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కత్తిలాంటి ఫిజిక్ ఉండాలి. ఫేస్ లుక్ అదుర్స్ అనేలా ఉండాలి. పైగా గ్లామర్ ను దాచుకోకుండా ఎక్స్ పోజింగ్ చేసేయాలి. అప్పుడే వారిని హీరోయిన్ అంటారు.
కానీ కొందరు హీరోయిన్లు తమ ఫిజిక్ వల్ల దారుణంగా ట్రోల్స్ కూడా ఎదుర్కున్నారు. బాడీ షేమింగ్ కు గురయ్యారు. స్టార్ హీరోయిన్లకు కూడా ఇది తప్పలేదు. ఇక ప్రియమణి కూడా ఈ కామెంట్లను ఎదుర్కుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. తెలుగు, తమిళంలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.
కాగా తాజా ఇంటర్వ్యూలో ఆమె ఎదుర్కున్న చేదు అనుభవాన్ని బయట పెట్టేసింది. ఆమె మాట్లాడుతూ.. తెలుగులోకి వచ్చిన కొత్తలో నన్ను చూసిన కొందరు మూవీ మేకర్స్ దారుణంగా అవమానించారు. చూడటానికి పందిలా ఉన్నావ్ నువ్వేం హీరోయిన్ అంటూ కామెంట్లు చేశారు. ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి.
కానీ నా కాన్ఫిడెన్స్ నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ఎవరైతే నన్ను అవమానించారో.. వారే నన్ను చూసి అసూయ పడలే చేశాను అంటూ ఎమోషనల్ అయింది ప్రియమణి. కానీ తనను అలా అవమానించింది ఎవరో మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.