Actress Shalu Shammu Commented On Tollywood Hero : ఈ నడుమ తెలుగు హీరోలపై కూడా బాగానే ఆరోపణలు వస్తున్నాయి. మొన్నటి వరకు పెద్దగా హీరోలపై ఆరోపణలు వచ్చేవి కావు. కానీ గత రెండేండ్లుగా చూసుకుంటే ఇలాంటి ఆరోపణలు హీరోలపై పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇలియానా, హన్సిక లాంటి స్టార్ హీరయిన్లు కూడా హీరోలపై దారుణమైన ఆరోపణలు చేశారు.
ఇప్పుడు మరో ప్రముఖ నటి కూడా ఇలాంటి సంచలన కామెంట్లు చేసింది. ఆమె ఎవరో కాదు కోలీవుడ్ నటి షాలు షమ్ము. ఆమె మనత తెలుగు జనాలుకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు గానీ.. సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి మాత్రం బాగానే తెలుసు. ఆమె కోలీవుడ్ లో ఓ రేంజ్ పాపులారిటీ ఉన్న నటి.
ఆమె అంటే కుర్రాళ్లు చిందులేస్తారు. అంతగా అందాలను ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నాకు ఓ తెలుగు డైరెక్టర్ నుంచి కాల్ వచ్చింది. నీకు టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాను.
కానీ ఒకసారి ఆ హీరోతో రాత్రంతా పడుకోవాలి అంటూ చెండాలంగా మాట్లాడాడు. అలాంటివి నేను అంగీకరించను అనేసరికి ఆ ఛాన్స్ మిస్సయ్యిందని చెప్పుకొచ్చింది. అయితే అందరిలాగా తాను మీటూ కంప్లయింట్ చేయలేదని.. దాన్ని అక్కడే వదిలేసినట్టు తెలిపింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఎవరా తెలుగు హీరో అంటూ అందరూ ఆరా తీస్తున్నారు.