Actress Shirisha : సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కు పెద్ద నిలయంగా మారిపోయింది. మీటూ ఉద్యమం తర్వాత ఎంతో మంది బయటకు వచ్చి తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు. చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్ల మీద ఆరోపణలు చేస్తున్నారు హీరోయిన్లు. అయితే కాస్టింగ్ కౌచ్ ను కొందరు ఎదుర్కుంటే.. కొందరు దానికి బలైపోతున్నారు.
ఇప్పుడు మరో నటి కూడా ఇలాంటి షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె ఎవరో కాదండోయ్ నటి శిరీష. ఆమె ఇప్పటికే తెలుగులో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె జూనియర్ ఆర్టిస్టుగా బాగానే పేరు సంపాదించుకుంది. కాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
నేను కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కు గురయ్యాను. అవకాశాల కోసం చాలామందికి కమిట్ మెంట్లు ఇచ్చాను. నన్ను శారీరకంగా వాడుకున్నారు కానీ నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. అప్పుడు నన్ను వాడుకున్న వారికి ఇప్పుడు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. వారంతా ఇప్పుడు పెద్ద పొజీషన్ లో ఉన్నారు.
అలాంటి వారిని నమ్మి నేను పొరపాటు చేశాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది శిరీష. నాకు ఇప్పుడు ఎలాంటి అవకాశాలు రావట్లేదు. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. నాకు ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది శిరీష. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read : Supreeta : మంచి అబ్బాయిని చూడండి.. మా అమ్మకు పెళ్లి చేస్తా.. సుప్రీత పోస్టు వైరల్..!
Also Read : Rashmi Gautam : నన్ను కూడా చాలామంది కమిట్ మెంట్ అడిగారు.. రష్మీ ఎమోషనల్..!