Ahimsa movie trailer release : శ్రీరెడ్డి బాయ్ ఫ్రెండ్ అభిరాం అహింస మూవీ ట్రైలర్ రిలీజ్..!

Ahimsa movie trailer release : దగ్గుబాటి రామానాయుడి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీలో లాంచ్ అవ్వనున్నాడు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఉన్నారు. .

By: jyothi

Published Date - Thu - 6 October 22

Ahimsa movie trailer release : శ్రీరెడ్డి బాయ్ ఫ్రెండ్ అభిరాం అహింస మూవీ ట్రైలర్ రిలీజ్..!

Ahimsa movie trailer release : దగ్గుబాటి రామానాయుడి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీలో లాంచ్ అవ్వనున్నాడు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఉన్నారు. అందులో సీనియర్ టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా ఉన్నారు. తాజాగా దగ్గుబాటి రానా సోదరుడు అభిరాం వెండితెరకు పరిచయం అవుతున్నాడు. తాజాగా అభిరాం నటించిన డెబ్యూ మూవీ అహింస ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ ఎలా ఉందంటే..

దగ్గుబాటి అభిరాం నటించిన అహింస మూవీ ట్రైలర్ విడుదల అవ్వడంతో దీని గురించి ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దగ్గుబాటి రానా తొలి సినిమాతోనే విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ అభిరాం కూడా తన సోదరుడి వలే విజయం సాధిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే విలేజ్ లవ్ యాక్షన్ మూవీని తలపిస్తోంది. ఇందులో అహింస గురించి ప్రస్తావిస్తూనే అందులో హింస ఏమాత్రం ఉండబోతుందో దర్శకుడు చూపించాడు. ఇక నటన విషయంలో అభిరాం కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. పల్లెటూరి బాగ్రౌండ్ లో సినిమా ట్రైలర్ లుక్స్ ఉండగా.. రివేంజ్ లవ్ స్టోరీ ఆధారంగా సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది.

ఇదిలాఉండగా అభిరాం సినిమా ట్రైలర్ విడుదల అవుతున్న తరుణంలో అతని చీకటి కోణాలను బయటపెడుతానని నటి శ్రీరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అభిరాం తనను మోసం చేశాడని, అవకాశాల పేరుతో వాడుకుని వదిలేశాడని వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను శ్రీరెడ్డి అప్పట్లో మీడియాకు రిలీజ్ చేసింది. ఈ విషయం నానా రచ్చకు దారితీసింది. ఆ పిక్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. తాజాగా అభిరాం కొత్త సినిమా కాస్త తలకిందులైతే శ్రీరెడ్డి ఏవిధంగా ట్రోల్ చేస్తుందని కూడా టాక్ వస్తోంది.

Read Also : Ileana D cruz : ఇలియానా ఇంత మందితో ఎఫైర్ న‌డిపిందా.. పెద్ద ముదురు రా బాబు..!

Read Also : Nagarjuna-Samantha-Nagachaitanya : స‌మంత‌, చైతూ పెండ్లికి నాగార్జున‌ను ఒప్పించిన స్టార్ హీరో అత‌నే..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News