Airtel: ఎయిర్ టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Airtel: మీరు మీ ఫోన్ లో ఎయిర్ టెల్ సిమ్ కార్డ్ వాడుతున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో రీఛార్జ్ చేసుకునేందుకు కూడా చేతిలో డబ్బుల్లేని నిరుపేదలకు, అల్ప ఆదాయ వర్గాల వారికి రూ.49 రీఛార్జ్ ప్యాక్ ని ఒకసారికి ఉచితంగా అందించనున్నట్లు ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. అంతేకాదు. రూ.79 రీఛార్జ్ ప్లాన్ తో రెట్టింపు ప్రయోజనాలను పొందొచ్చని స్పష్టం చేసింది. ఈ రెండు స్పెషల్ ఆఫర్లను వారం […].

By: jyothi

Published Date - Sun - 16 May 21

Airtel: ఎయిర్ టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Airtel: మీరు మీ ఫోన్ లో ఎయిర్ టెల్ సిమ్ కార్డ్ వాడుతున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో రీఛార్జ్ చేసుకునేందుకు కూడా చేతిలో డబ్బుల్లేని నిరుపేదలకు, అల్ప ఆదాయ వర్గాల వారికి రూ.49 రీఛార్జ్ ప్యాక్ ని ఒకసారికి ఉచితంగా అందించనున్నట్లు ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. అంతేకాదు. రూ.79 రీఛార్జ్ ప్లాన్ తో రెట్టింపు ప్రయోజనాలను పొందొచ్చని స్పష్టం చేసింది. ఈ రెండు స్పెషల్ ఆఫర్లను వారం రోజుల్లో ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ వర్తింపజేస్తామని పేర్కొంది. తమ నెట్ వర్క్ ని వాడుకునేవారికి కొవిడ్ కష్టకాలంలో తమ వంతు సాయంగా ఈ ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ వివరించింది. ఈ నిర్ణయం వల్ల తమకు 270 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, అయినప్పటికీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సంతోషంగా భరిస్తామని తెలిపింది.

పల్లె ప్రజలకు ప్రయోజనం..

గ్రామాల్లో ఎక్కువ మంది ఎయిర్ టెల్ సిమ్ కార్డే వాడతారు. ఆ తర్వాత ఐడియా, ఇప్పుడిప్పుడే జియో సిమ్ కార్డులను కూడా వినియోగిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్ కి ఇండియాలో మొత్తం 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో పల్లె ప్రాంతాల్లో నివసించే దాదాపు 5.5 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని పేర్కొంటున్నారు. 49 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తో 38 రూపాయల టాక్ టైమ్, 100 ఎంబీల డేటాను ఫ్రీగా పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

మిగతా సంస్థలూ..

ఎయిర్ టెల్ నిర్ణయం పట్ల ఆ సంస్థ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ ప్రభావం నుంచి కస్టమర్లను కాస్తయినా బయటపడేసేందుకు ఇలా అన్ని సంస్థలూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. లాక్డౌన్ వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవటంతో స్మార్ట్ ఫోన్లలో డేటా వాడకం భారీగా పెరుగుతోంది. తద్వారా టెలికం సంస్థలు గతంలో కన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. అందులో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇవ్వాలనుకోవటం ఎయిర్ టెల్ సంస్థ ఉదారతకు చక్కని ఉదాహరణ అని పలువురు మెచ్చుకుంటున్నారు.

Related News