Akkineni Naga Chaitanya : టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటే చైతూ అని అందరూ చెబుతారు. అప్పట్లో సమంత, చైతూ జంటకు ఎంత మంది ఫ్యాన్స్ ఉండేవారో అందరికీ తెలిసిందే. వీరిద్దరినీ అప్పట్లో క్యూట్ పెయిర్ గా చెప్పుకునేవారు. కానీ వీరిద్దరూ సడెన్ గా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరువురి ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు.
ఇక ఈ ఇద్దరూ అప్పటి నుంచి ఎవరు ఎక్కడ మాట్లాడినా సరే ఒకరి మాటలను మరొకరికి లింక్ పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా చైతూకు సంబంధించిన మరో విషయం కూడా వైరల్ అవుతోంది. చైతూ సమంత కంటే ముందే ఓ అమ్మాయిన ప్రేమించాడంట. ఆమె ఎవరో కాదండోయ్ కమల్ హాసన్ కూతురు శృతిహాసన్.
Akkineni Naga Chaitanya Dated Shruti Haasan For Few Days
ఈ ఇద్దరూ అప్పట్లో ప్రేమలో పడ్డారు. శృతితో చైతూ కొన్ని రోజులు డేటింగ్ కూడా చేశాడు. అప్పట్లో వీరిద్దరూ చాలా సార్లు రెస్టారెంట్లకు కూడా వెళ్లారు. మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ శృతితో బంధం బలపడుతున్న టైమ్ లోనే సమంతతో ప్రేమలో పడ్డాడు.
దాంతో ఈ విషయం తెలుసుకున్న శృతి అతనికి దూరంగా జరుగుతు వచ్చింది. ఇద్దరూ అప్పటి నుంచి వేర్వేరుగానే ఉంటున్నారు. ఇక సమంతతో ప్రేమ తర్వాత ఆమెను పెండ్లి చేసుకున్నాడు చైతూ. కానీ ఇప్పుడు మాత్రం సింగిల్ గానే ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన శోభితతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి.
Read Also : Akhil Akkineni : ఆ హీరోయిన్ ను లైంగికంగా వేధించిన అఖిల్.. సంచలన మ్యాటర్ లీక్..!
Read Also : Pooja Hegde : ఫ్రెండ్ లవర్ తో డేటింగ్ చేసిన పూజాహెగ్డే.. అప్పట్లో ఇదో సంచలనం..!