Akshay Kumar : సినిమా రంగం అనేది ఎందరికో కలల ప్రపంచం. ట్యాలెంట్ ఉంటే ఇక్కడే స్టార్లుగా రాణిస్తారు. లేదంటే కొట్టుకుపోతారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా ఎదిగి వేల కోట్లు సంపాదించిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్ గా ఉన్న ఓ హీరో ఒకప్పుడు హోటల్ లో వెయిటర్ గా పని చేశాడు.
ఆ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. డబ్బుల్లేక వెయిటర్ గా చేసిన అతనే …. అంచెలంచెలుగా ఎదిగి ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ హీరోగా ఉన్నారు. ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా బాలీవుడ్ కిలాడీ హీరో అక్షయ్ కుమార్. అవును మీరు విన్నది నిజమే.
ఆయన గతంలో థాయిలాండ్ లో వెయిటర్ గా పని చేశారు. ఆ విషయం తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలా వెయిటర్ గా పని చేస్తూనే ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంటర్ అయ్యాడు. అలా మెల్లిమెల్లిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అయ్యాడు. ఇప్పుడు వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు.
ఈ విషయాలను గతంలో అక్షయ్ కుమార్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నేను వెయిటర్ గా పని చేస్తున్నప్పుడు కూడా బాధపడలేదు. ఎందుకంటే బతకడానికి ఏ పని చేసినా పర్వాలేదు. అదే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం కదా.
Read Also : Varun Tej : లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్లి నాగబాబుకు ఇష్టం లేదట.. ఇదిగో ప్రూఫ్..!
Read Also : Sri Reddy : మెగా ఫ్యామిలీలో బన్నీ ఒక్కడే నిజమైన మగాడు.. అంతా చెత్తగాళ్లేః శ్రీరెడ్డి