Allu Arjun Gave Warning To College Principal : నీ కూతురును లేపుకుని పోతా.. ప్రిన్సిపల్ కు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్..!

Allu Arjun Gave Warning To College Principal : అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి చిలిపి వేశాలు వేస్తూ అందరితో దెబ్బలు తినేవాడంట. ఇంటర్ చదువుతున్న సమయంలో కాలేజీకి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లేవాడంట. ఓ రోజు బన్నీ మార్క్స్ చూసిన ప్రిన్సిపల్ ఎలాగైనా అల్లు అరవింద్ కు బన్నీ గురించి చెప్పి మార్చాలని చూశారంట..

By: jyothi

Updated On - Mon - 26 June 23

Allu Arjun Gave Warning To College Principal : నీ కూతురును లేపుకుని పోతా.. ప్రిన్సిపల్ కు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్..!

Allu Arjun Gave Warning To College Principal : అల్లు అర్జున్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటో తెలుసుకుందాం. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి చిలిపి వేశాలు వేస్తూ అందరితో దెబ్బలు తినేవాడంట. ఇంటర్ చదువుతున్న సమయంలో కాలేజీకి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లేవాడంట. ఓ రోజు బన్నీ మార్క్స్ చూసిన ప్రిన్సిపల్ ఎలాగైనా అల్లు అరవింద్ కు బన్నీ గురించి చెప్పి మార్చాలని చూశారంట.

ఓ రోజు అల్లు అరవింద్ ను పిలిపించారు. బన్నీతో పాటు కాలేజీకి వెళ్లాడు అరవింద్. బన్నీనీ క్లాస్ లో దింపేసి.. ఆయన ప్రిన్సిపల్ రూమ్ కు వెళ్లాడు. అయితే కోపం మీద ఉన్న ప్రిన్సిపల్ అన్నీ చెబుతాడని మీరు అనుకుంటున్నారు కదా.. కానీ ఏమీ చెప్పుకుండా బన్నీ మార్క్స్ లిస్ట్ ఇచ్చేసి సైలెంట్ గా ఉండిపోయారంట.

ఎందుకంటే అల్లు అరవింద్ ను పిలిపిస్తున్నట్టు తెలియడంతో బన్నీ వెళ్లి మాస్ స్టైల్ లో ప్రిన్సిపల్ కు వార్నింగ్ ఇచ్చాడంట. నా గురించి చెబితే మీ కూతురును లేపుకుని పోతా అంటూ చెప్పేసరికి.. పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఆయన కూడా భయపడ్డాడంట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

 

Read Also : Nithin Emotional An Interview : యాక్టింగే రాదంటూ నితిన్ చెంప పగలగొట్టిన డైరెక్టర్.. ఎవరో తెలుసా..?

Read Also : Actress Sudha Spoke About Jr NTR : ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News