Arjun Reddy : కొన్ని సినిమా కథలను హీరోలు తెలిసి, తెలియక రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ అవి ప్లాప్ అయితే వారు సేఫ్ అయినట్టే. కానీ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయంటే మాత్రం బాధపడాల్సి వస్తోంది. ఒక్కోసారి అలా రిజెక్ట్ చేసిన సినిమాలతోనే ఇతర హీరోలు ఓవర్ నైట్ స్టార్లు అయిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో రిజెక్ట్ చేసిన హీరోలది బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి.
అప్పట్లో అర్జున్ రెడ్డి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ మూవీతోనే విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఇండస్ట్రీ రికార్డులను చెరిపేసింది. దీంతో అటు బాలీవుడ్ లో కూడా విజయ్ కు భారీగా ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అయితే ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో విజయ్ దేవరకొండ కాదంట. ముందుగా అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారు. కానీ ఇలాంటి రౌడీ హీరో పాత్ర తనకు సెట్ కాదని అల్లు అర్జున్ రిజెక్ట్ చేశారు. దాంతో అదే కథను శర్వానంద్ కు వినిపించాడు సందీప్ రెడ్డి. కానీ డేట్స్ ఖాళీగా లేవని శర్వా కూడా వద్దన్నాడు.
Allu Arjun Rejected Movie Arjun Reddy
చివరకు విజయ్ వద్దకు వచ్చింది ఈ కథ. విజయ్ వెంటనే ఓకేచెప్పడంతో సెట్స్ మీదకు వెళ్లింది. డిఫరెంట్ లవ్ స్టోరీ కావడంతో యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. దెబ్బకు విజయ్ స్టార్ హీరో అయిపోయాడు. అదే సినిమాను అల్లు అర్జున్ చేసి ఉంటే ఆయన ఇమేజ్ వేరే లెవల్ లో ఉండేదేమో.
Read Also : Chammak Chandra : ఆ హీరో ఇంట్లో పనిమనిషిగా చేశా.. చమ్మక్ చంద్ర కష్టాలు..!
Read Also : Jabardasth Show : జబర్దస్త్ ను నిలబెట్టిన ఒకే ఒక్కడు.. సుధీర్, ఆదిలు మాత్రం కాదు.. ఎవరంటే..?