Amma Vs Anna : ‘అమ్మ’ పోయి.. ‘అన్న’ వచ్చె..

Amma Vs Anna: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా 2013లో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో 407 సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. వాటిలో పేదలకు ఒక్క రూపాయికే ప్లేట్ ఇడ్లీ, మూడు రూపాయలకే ప్లేట్ భోజనం, మూడు రూపాయలకే ప్లేట్ చెపాతీ ప్లస్ పప్పు ఇస్తున్నారు. ఏడేళ్లకు పైగా విజయవంతంగా నడుస్తున్న ఈ క్యాంటీన్ల పేరు ఇక మారబోతోంది. ‘అమ్మ’ ప్లేసులో ‘అన్న’ రాబోతున్నాడు. అన్న అంటే డీఎంకే […].

By: jyothi

Published Date - Wed - 5 May 21

Amma Vs Anna : ‘అమ్మ’ పోయి.. ‘అన్న’ వచ్చె..

Amma Vs Anna: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా 2013లో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో 407 సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. వాటిలో పేదలకు ఒక్క రూపాయికే ప్లేట్ ఇడ్లీ, మూడు రూపాయలకే ప్లేట్ భోజనం, మూడు రూపాయలకే ప్లేట్ చెపాతీ ప్లస్ పప్పు ఇస్తున్నారు. ఏడేళ్లకు పైగా విజయవంతంగా నడుస్తున్న ఈ క్యాంటీన్ల పేరు ఇక మారబోతోంది. ‘అమ్మ’ ప్లేసులో ‘అన్న’ రాబోతున్నాడు. అన్న అంటే డీఎంకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై అన్న మాట. మొన్నటి శాసన సభ ఎన్నికల్లో అధికార పార్టీ అన్నాడీఎంకే ఓడిపోయి ప్రతిపక్ష పార్టీ డీఎంకే గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో పొలిటికల్ యాంగిల్ లో ఈ పేరు మార్పు కంపల్సరీ కాబోతోంది.

అదనంగా 500 కలైంగర్ క్యాంటీన్లు..

అమ్మ క్యాంటీన్ల పేరును అన్న క్యాంటీన్లుగా మార్చటంతోపాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 500 క్యాంటీన్లను కలైంగర్ పేరుతో ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీఎంకే పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ లో భాగంగా అమ్మ క్యాంటీన్ల వద్ద ఉన్న జయలలిత ఫొటోలు, నేమ్ బోర్డులు కనిపించకుండా అధికారులు తెల్లని టేప్ అంటించారు. ఇప్పుడు ఆ కోడ్ ముగిసినా ఆమె ఫొటోలు గానీ నేమ్ బోర్డులు గానీ మరో ఐదేళ్లపాటు కనిపించే ఛాన్సే లేదు. అమ్మ క్యాంటీన్ పేరుతోపాటు జయలలిత ఫొటోలను కూడా కొత్త (డీఎంకే పార్టీ) ప్రభుత్వం తొలగించనుండటమే దీనికి కారణం.

Amma Vs Anna

ఘర్షణ.. ఉద్రిక్త వాతావరణం..

అమ్మ క్యాంటీన్ల పేరు మార్చుతారనే వార్తల నేపథ్యంలో మొగప్పైర్ ప్రాంతంలో నిన్న మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడి క్యాంటీన్ ని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పేరు మార్పు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అమ్మ క్యాంటీన్ల వద్ద జయలలిత ఫొటోల పైన, నేమ్ బోర్డుల పైన అతికించిన వైట్ టేప్ ను తొలగిస్తామని, ఈ పథకం కొనసాగుతుందని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

Related News