Anchor Bharti Singh Comments An Interview : ఈ నడుమ సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు చాలా వైరల్ అవుతున్నాయి. కావాలని చేస్తున్నారో లేకపోతే పేమస్ అవ్వడానికి చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ వారు చేస్తున్న కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో ఫేమస్ అవుతున్నాయి. ఇప్పుడు మరో యాంకర్ కూడా ఇలాంటి కామెంట్లు చేసి వార్తల్లోకి ఎక్కింది.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ టాప్ యాంకర్ భారతీ సింగ్. ఆమె కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఎన్నో టీవీ షోలు, రియాల్టీ షోలల్లో పాల్గొంది ఈ హాట్ బ్యూటీ. భారతీ సింగ్ చేసే కామెంట్లు అప్పుడప్పుడు సంచలనం రేపుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఆమె మరో ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో తాను తల్లిని కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ఇంకా పిల్లలను కనకపోవడం వల్ల లాభం లేదు. త్వరలోనే పిల్లల్ని కంటాను. నన్ను తల్లిని చేయండి అంటూ తన భర్తను ఇంటర్వ్యూలో కోరుకుంది. తన భర్త పేరు హార్ష్. వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
అప్పటి నుంచి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. మేమిద్దరం బిగ్ బాస్ లోకి వెళ్తే.. అక్కడే పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకోవాలని భావించాం. కానీ మాకు ఆ ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా ప్లాన్ చేస్తున్నాం అంటూ తెలిపింది ఈ భామ.