Anchor Jhansi : యాంకర్ ఝాన్సీ మొదటి నుంచి మల్టీ ట్యాలెంటెడ్ గా దూసుకుపోతోంది. ఆమె వెండితెరపై నటిగా రాణిస్తూనే.. ఇటు బుల్లితెరపై యాంకర్ గా కూడా ఎన్నో షోలు చేసింది. సినీ కెరీర్ పరంగా ఆమె మంచి పొజీషన్ లోనే ఉంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటూ వస్తోంది.
ఝాన్సీ గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జోగినాయుడుతో తొమ్మిదేండ్లు ప్రేమలో ఉంది. ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లో వారిని ఒప్పిచి పెండ్లి చేసుకున్నారు. కానీ కూతురు పుట్టిన ఏడాదిలోపే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి విడాకులకు ఝాన్సీకి ఉన్న ఎఫైరే కారణమంటూ చాలా రూమర్లు వచ్చాయి.
అయితే తాజాగా వాటిపై స్పందించింది ఝాన్సీ. నేను ఇండస్ట్రీలో చాలామందితో సన్నిహితంగా ఉండేదాన్ని. చాలామంది హీరోలు నన్ను వారి ఇంట్లో మనిషిలా చూసుకునే వారు. కానీ కొందరు నాకు వారితో ఎఫైర్లు అంటగట్టారు. హీరో జగపతిబాబుకు నాకు అప్పట్లో మంచి సన్నిహిత్యం ఉండేది.
అలాంటి ఆయనతో కూడా నాకు ఎఫైర్ ఉందని నానా రకాల రూమర్లు పుట్టించారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఆయన నాకు మంచి బ్రదర్ లాంటివారు. నాకు ఎంతో సాయం చేశారు. అలాంటి మంచి వ్యక్తితో నాకు అక్రమ సంబంధాలు అంటగట్టిన వారు సిగ్గుతో చచ్చిపోవాలి అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు జగపతి బాబు.
Read Also : Anil Ravipudi : బుద్ధిలేని పని చేస్తున్న అనిల్ రావిపూడి.. నిర్మాతను ముంచేస్తున్నాడా..?
Read Also : Manchu Lakshmi : అనుష్క శెట్టిని నమ్మి కోట్లు నష్టపోయా.. మంచులక్ష్మీ షాకింగ్ వ్యాఖ్యలు..!