Anchor Sreemukhi : సినిమా రంగంలో రాణించడం అంటే ఇప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న అమ్మాయిలకు అది పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారికి కచ్చితంగా కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురవుతుంది. దాన్ని దాటుకుని వెళ్లేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. కొందరు దానికి బలైపోతుంటారు.
ఇంకొందరు ధైర్యంగా ఎదుర్కుంటారు. కాగా ఇప్పుడు యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి కూడా ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాలను ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నేను యాంకర్ గా మారక ముందే హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను.
చాలా సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేశాను. కానీ నాకు ఛాన్సులు రాలేదు. అలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమయంలోనే ఓ డైరెక్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆ డైరెక్టర్ మేనేజర్ నన్ను ఆఫీసుకు రమ్మన్నాడు. సరే అని వెళ్లాను. కానీ ఆ డైరెక్టర్ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు.
అతను చాలా అసభ్యంగా మాట్లాడాడు. నీకు ఛాన్స్ ఇస్తా కానీ నేను చెప్పినట్టు వినాలి అప్పుడు నీకు హీరోయిన్ గా అవకాశాలు ఇప్పిస్తాను. నా అవసరాలకు నువ్వు తోడుగా ఉండాలి అంటూ నీచంగా మాట్లాడాడు. దాంతో నేను అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సినిమా రంగంలో తిరగడం మానేసి బుల్లితెరపై యాంకర్ గా మారాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి.
Read Also : Anushka Shetty : ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో అనుష్కశెట్టి పెళ్లి.. ఇది మాత్రం పక్కానట..!
Read Also : Senior Heroine : యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్న సీనియర్ హీరోయిన్.. పెళ్లైనా ఇవేం పనులు..!