Anchor Sreemukhi : యాంకర్ గా ఇప్పుడు శ్రీముఖి రేంజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆమె చేతిలో ఉన్నన్ని అవకాశాలు ఇంకా వేరే వారి చేతిలో లేవు. సుమను మించి ఆమెకు రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే మాటలు కాదు. ఈ రేంజ్ లో ఆమె రాణిస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదు. కానీ ఈ స్థాయికి రావడం వెనక శ్రీముఖి కష్టం చాలానే ఉంది.
అయితే శ్రీముఖి మొదట్లో బుల్లితెర కంటే వెండితెరపైనే కనిపించింది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే ఆమెకు ఇటు బుల్లితెరపై కూడా రాణించాలని ఉండేది. కానీ అంత కంటే ఎక్కువగా ఆమెకు సినిమాల్లో ఎలాగైనా హీరోయిన్ గా చేయాలని ఆశ చాలానే ఉండేది.
అందుకే త్రివిక్రమ్ సలహాలు తీసుకుంటూ ఉండేదంట. జులాయి సమయంలో ఇద్దరి మధ్య మంచి బాండిగ్ ఏర్పడింది. కాగా సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సుల కోసం వెతుకుతున్న సమయంలోనే ఓ షోలో యాంకరింగ్ చేసే అవకాశం శ్రీముఖికి వచ్చింది. కానీ త్రివిక్రమ్ వద్దని చెప్పారంట.
నువ్వు బుల్లితెరపై రాణిస్తే వెండితెరపై నీకు ఛాన్సులు తగ్గిపోతాయి. నువ్వు వెండితెరపైనే ఉంటే నీకు కచ్చితంగా హీరోయిన్ గా చేసే అవకాశాలు వస్తాయని చెప్పడంతో ఆమె యాంకరింగ్ ఛాన్స్ వదులుకుంది. అలా రెండేండ్ల పాటు బుల్లితెరపై ఛాన్సులు రిజెక్ట్ చేసింది. కానీ ఎంతకూ హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో చివరకు పటాస్ షోతో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. నేడు అగ్ర యాంకర్ గా ఉంది.
Read Also : Samantha : సమంతలో అది నాకు చాలా ఇష్టం.. అందుకే పెళ్లి చేసుకున్నాః నాగచైతన్య
Read Also : Samantha : అర్హత లేకున్నా హీరోలు అవుతున్నారు.. చైతూపై సమంత కౌంటర్లు..!