Anchor Sreemukhi Sensational Comments On Tollywood Director : యాంకర్ గా శ్రీముఖి ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఒక రకంగా చెప్పాలంటే అందరు యాంకర్ల కంటే ఆమెనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమెచేతిలో ఉన్నన్ని అవకాశాలు ఇంకెవరి చేతిలో లేవనే చెప్పుకోవాలి.
అయితే శ్రీముఖి మొదట్లో సినిమాల్లో నటించాలని ఆశ పడింది. అనుకున్నట్టుగానే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు కూడా చేసింది. కానీ సినిమాల్లో రాణించాలనుకున్న ఆమె కలను ఓ డైరెక్టర్ నాశనం చేశాడంట. ఈ విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమెనే వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ.. నేను సినిమాల్లో మంచి పాత్రలు చేయాలని అనుకున్నాను. ఆ సమయంలో ఓ సీనియర్ డైరెక్టర్ నన్ను అవకాశాల పేరుతో తన చుట్టూ తిప్పుకున్నాడు. వేరే సినిమాల్లో కూడా ఛాన్సులు రాకుండా అడ్డుకున్నాడు. తన కోరిక తీరిస్తే ఛాన్స్ ఇస్తానని అన్నాడు. నాకు చాలా భయం వేసింది.
ఇండస్ట్రీలో ముందు ముందు ఇలాంటివి ఇంకా ఎన్ని ఉంటాయో అనే భయంతో సినిమాలను వదిలిపెట్టాను. నాకు యాంకరింగ్ వచ్చు కాబట్టి టెలివిజన్ వైపు వచ్చేశాను. నేను అనుకున్నట్టుగానే ఇక్కడ సక్సెస్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.