Anchor Suma Kanakala : యాంకర్ గా సుమకు ఉన్న పాపులారిటీ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆమె మలయాళం నుంచి వచ్చినా సరే తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ఇక్కడ స్టార్ యాంకర్ గా ఎదిగింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు అమ్మాయిల కంటే ఎక్కువగా ఆమె తెలుగులో మాట్లాడుతోంది. ఇక్కడ ఏ పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే యాంకర్ సుమ మాత్రమే చేయాలి.
ఆ రేంజ్ లో ఆమె ఫాలోయింగ్ సంపాదించుకుంది. పెద్ద హీరోలను ఇంటర్వ్యూ చేయాలంటే మాత్రం అది కేవలం సుమకు మాత్రమే సాధ్యం. ఆమె తర్వాతనే ఎవరైనా సరే. ఎంత మంది యాంకర్లు పుట్టుకొస్తున్నా సరే ఆమెను కొట్టేవారే మాత్రం రాలేకపోతున్నారు. అంతగా ఆమె కష్టపడుతూనే ఉంటుంది.
అయితే ఆమె వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆమె ఆస్తుల చిట్టా గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కో షోకు, ఈవెంట్ కు రూ.3.5లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తీసుకుంటుంది. ఆమె ఆస్తులు మొత్తం కలిపి రూ.125 కోట్లు అని తెలుస్తోంది.
తన భర్త రాజీవ్ కనకాల కూడా నటుడిగా బాగానే సంపాదిస్తున్నాడు. అలాగే అంతకు ముందు రాజీవ్ ఆస్తులు కూడా ఉన్నాయి. ఇలా వీటన్నింటి విలువ కలిపి ఇంతగా ఉంది. ఇక వీరికి కూకట్ పల్లిలో రూ.8 కోట్ల విలువ చేసే ఇల్లు కూడా ఉంది. అలాగే లగ్జరీ కార్లు కూడా వీరి సొంతం.
Read Also : Anushka Shetty : ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో అనుష్కశెట్టి పెళ్లి.. ఇది మాత్రం పక్కానట..!
Read Also : Akkineni Heroes : నోరు జారుతున్న అక్కినేని హీరోలు.. పరువు తీసుకుంటున్నారా..?