Anchor Vishnu Priya Responded About Casting Couch : హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ విష్ణుప్రియ ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. మొన్నటి వరకు బుల్లితెరపై యాంకర్ గా చేసిన ఆమెకు ఇప్పుడు యాంకర్ గా అవకాశాలు రావట్లేదు. దాంతో నటిగా తానేంటో నిరూపించుకోవాలని ఆరాట పడుతోంది.
ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తూ చాలా బిజీగా మారిపోయింది ఈ భామ. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో షాకింగ్ కామెంట్లు చేసింది. మొదట పురుషాధిక్యం గురించి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో పురుషాధిక్యం ఎక్కవగానే ఉంది.
ఇది పోవాలంటే ఇంకొన్ని రోజులు పడుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే అంటూ తెలిపింది. అలాగే కాస్టింగ్ కౌచ్ మీద కూడా స్పందించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది బాగానే ఉంది. కానీ అది చేసుకోవాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు నన్ను చూడండి.
కెరీర్ స్టార్టింగ్ లో నన్ను కూడా చాలామంది కోరిక తీర్చమంటూ అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఒప్పుకున్న వారిని తప్పుగా చూడాల్సిన పనిలేదు. ఎందుంకంటే ఎవరి అభిప్రాయాలు వారివి. కాబట్టి మనం అవన్నీ పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి అంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ.
Also Read : Surekha Vani Drug Case : సురేఖ వాణి కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరోనా..?