Anil Ravipudi : బాలయ్య ఇప్పుడు వరుసగా మూవీలు చేస్తున్నాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు పడటంతో ఇప్పుడు ఫుల జోష్ లో ఉన్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే ఆయన హిట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడితో తన 108 సినిమాను చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం అనిల్ రావిపూడి భారీగానే ప్లాన్ చేస్తున్నాడంట.
అయితే ఇప్పుడు అనిల్ చేస్తున్న పని నిర్మాతను నిండా ముంచేస్తోందని అంటున్నారు విశ్లేషకులు. బాలయ్యతో తాను చేస్తున్న సినిమాకు భారీగా బడ్జెట్ ను పెట్టిస్తున్నాడంట. తాము ముందు అనుకున్నదానికంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారంట. కేవలం ఇంటర్వెల్ యాక్షన్ సీన్ కోసమే రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నాడంట అనిల్.
ఇక సినిమాలో మెయిన్ కాస్ట్, వారి రెమ్యునరేషన్ ఇవన్నీ చూసుకుంటే బడ్జెట్ రూ.100కోట్లు దాటిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. బాలయ్య మీద ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు. ఎందుకంటే బాలయ్యకు అంత సీన్ లేదని అంటున్నారు విశ్లేషకులు.
బాలయ్య సినిమాలకు ఇప్పటి వరకు ఇంత మొత్తంలో ఎవరూ ఖర్చు పెట్టలేదు. బాలయ్య కెరీర్ లో ఇది అత్యధిక బడ్జెట్. ఏ మాత్రం తేడా కొట్టినా నిర్మాత నిండా మునిగిపోతాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని సదరు నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారంట. కానీ అనిల్ మాత్రం వినట్లేదని తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో.
Also Read : Sai Pallavi : సాయిపల్లవితో లవ్ ఎఫైర్ రూమర్లు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
Also Read : Pawan Kalyan : పవన్ కల్యాణ్ మిస్ చేసుకున్న 5 బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?