Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఏ చిన్న సమస్య వచ్చినా సరే అభిమానులు అస్సలు ఊరుకోరు. ఎందుకంటే అందరు హీరోలకు అభిమానులు మాత్రమే ఉంటారు. కానీ పవన్ కు మాత్రం వీరాభిమానులు, అంతకు మించి ఆయన్ను దేవుడిలా కొలిచే భక్తులు కూడా ఉంటారు. అలాంటి పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్ కోసం ఏం చేయడానికి అయినా సరే రెడీగా ఉంటారు.
ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ సీక్రెట్ బటయ పడింది. అదికూడా పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి బయట పెట్టడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆమె తాజాగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కు చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. అందుకే వాడిని కంటికిరెప్పలా చూసుకున్నాను. ఇప్పుడు వాడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్నాడు. ఎండననక, వాననక చాలా కష్టపడుతున్నాడు. వాడి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయట్లేదు. వాడి ఆరోగ్యం గురించి నాకు ఎప్పుడూ భయంగానే ఉంటుంది.
అందుకే వాడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది అంజనా దేవి . ఆమె చేసిన వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు. తన ఆరోగ్యాన్ని కూడా పవన్ లెక్క చేయట్లేదు.. ప్రజల కోసం కష్టపడుతున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Read Also : Actress Shakeela : ఏడుగురితో ఎఫైర్ పెట్టుకున్నా.. షకీలా బోల్డ్ కామెంట్లు..!
Read Also : Super Star Mahesh Babu : మహేశ్ కెరీర్ ను రెండుసార్లు నిలబెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?